Comedian santhanam earns 30 cr per year

Santhanam earns 30 Cr per year, Santhanam Romance With Top Heroines, Santhanam Starts Romance With 9 Heroines

Comedian Santhanam earns 30 Cr per year

‘సంతానం ’ కోసం సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్లు

Posted: 07/07/2014 05:18 PM IST
Comedian santhanam earns 30 cr per year

సినిమా ఇండస్ట్రీలో కమేడియన్లకు ఎప్పుడు ప్రముఖ స్థానం ఉంటుంది. కొంత మంది కమేడియన్స్ తన హావ భావాలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి నటనలోనే కాకుండా పారితోషికంలో కూడా తన సత్తా చాటుకుంటారు. టాలీవుడ్ బహ్మానందం లేకుండా సినిమాలు ఎలా తీయలేరో ఇప్పుడు తమిళ సినిమాలు కమేడియన్ ‘సంతానం ’ లేకుండా తీయలేని స్థాయికి దర్శకులు వచ్చారంటే ఆయన క్రేజ్ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

కేవలం కమేడియన్ గానే కాకుండా హీరోగా కూడా నటిస్తూ దూసుకుపోతున్న ఈయన సంపాదన సంవత్సరానికి 30 కోట్లంటే నమ్మకం కలగడం లేదా ? ఇది నిజం. తమిళ నటుడు వడివేలు రాజకీయ నోటి దుల కారణంగా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో సంతానం ఇప్పుడు స్టార్ కమేడియన్ అయ్యాడు. సంవత్సరానికి దాదాపు 15 – 20 సినిమాల్లో నటించే ఈయన ఒక్కోసినిమాకు సగటున రెండు కోట్లు తీసుకుంటూ ముప్పై కోట్ల వరకు సంపాదిస్తాడట.

ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కమేడియన్ దర్శకుడు విజయ్‌ చందర్‌ ‘కన్నిరాశి ’ టైటిల్‌తో తెరకెక్కబోతున్న మరో మూవీలో ఏకంగా తొమ్మిది మంది హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయబోతున్నాడట. ఇప్పటికే ఆ చిత్ర దర్శకుడు ఆ తొమ్మిది మంది బ్యూటీస్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నాడని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. మరి ఈయన సరసరన సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ నటింప జేస్తారా ? బి గ్రేడ్ హీరోయిన్స్ ను నటింప జేస్తారా ? అనేది చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles