Alia bhatt wants to work with junior ntr

Alia bhatt wants to work with junior ntr, alia bhatt latest news, alia bhatt wants to work with junior ntr, alia bhat in humpty sharma ki dulhania, alia bhatt in hyderabad, alia bhatt hot photo shoot, alia bhatt latest photos

Alia bhatt wants to work with junior ntr

జగన్-ఎన్టీయార్ తో సై అంటున్న హీరోయిన్

Posted: 06/27/2014 01:06 PM IST
Alia bhatt wants to work with junior ntr

(Image source from: Alia bhatt wants to work with junior ntr)

బాలీవుడ్ లో ప్రముఖ దర్శకనిర్మాత అయిన మహేష్ భట్ కూతురు ఆలియా భట్... ఈమధ్య కుర్రవేషాలు చాలా ఎక్కువగా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ‘‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’’ సినిమా ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమైన ఈ అమ్మడూ... అనతికాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. ఆ తరువాత ‘‘హైవే, 2 స్టేట్స్’’ సినిమాల్లో నటించిన ఈ పొట్టిపిల్ల... ఆ రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడంతో స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోయింది.

చిన్నచిన్న డ్రెస్సులు వేసుకుని కుర్రకారులను మత్తెక్కిస్తున్న ఈ తార... తన మనసులో వున్న మాటను బయటపెట్టేసింది. తనకు తగిన ఫ్యూచర్ జోడీ గురించి అందరి ముందు బహిర్గతం చేసేసింది. ‘‘అతనే నాకు కరెక్ట్ జోడీ’’ అంటూ సమాధానం ఇచ్చింది. అతను ఎవరా అని ఆరా తీస్తే... టాలీవుడ్ జూనియర్ ఎన్టీయార్ అని చెప్పిందని మీడియా వర్గాలు తెలుపుతున్నాయి.

తన తాజా చిత్రం అయిన హంప్టీ శర్మకి దుల్హనియా చిత్రం ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు వచ్చిన ఆలియా భట్... తెలుగు మీడియావారితో కొద్దిసేపటి వరకు ముచ్చటించింది. అందులో ఒకరు ‘‘టాలీవుడ్ లో అవకాశం వస్తే మీరు ఎవరితో నటించడానికి ఇష్టపడతారు..? అని ప్రశ్నిస్తే... దానికి సమాధానంగా జూనియర్ ఎన్టీయార్ తో కలిసి నటిస్తానని చెప్పింది.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నుంచి మంచి స్టోరీతో కూడిన పాత్ర లభిస్తే... తాను నటించడానికి రెడీ అని చెప్పింది. అలాగే ముంబయిలో తనకు సంబంధించిన కొందరు స్నేహితులు తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న ఎన్టీయార్ గురించి ఎప్పుడూ ప్రస్తావించే వారని... ఒకవేళ టాలీవుడ్ లో నటించే అవకాశం వస్తే జూనియర్ ఎన్టీయార్ తో కలిసి నటించమని సలహాలు ఇచ్చినట్టు చెప్పుకుంది. దాంతో ఈ అమ్మడు కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే అది జూనియర్ ఎన్టీయార్ తో కలిసి నటిస్తానని నిక్కచ్చిగా చెప్పేసింది. అలాగే డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో నటించాలని వుందని తన మనసులో వున్న కోరికను నలుగురితో పంచుకుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles