Pawan kalyan venkatesh multi starrer launched

Pawan-Venkatesh multi-starrer launched, Oh My God remake, Venkatesh, Pawan Kalyan, pawan kalyan venkatesh oh my god remake, oh my god title gopala gopala, venky pawan gopala gopala, venky pawan film title

Pawan Kalyan - Venkatesh multi-starrer Gopala-Gopala movie launched today.

వెంకీ - పవన్ సినిమా మొదలయ్యింది

Posted: 06/09/2014 04:18 PM IST
Pawan kalyan venkatesh multi starrer launched

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా మళ్లీ మొదలైన వేళ క్రేజీ కాంబినేషన్ సినిమా నేడు ప్రారంభోత్సవం జరుపుకుంది. అదే వెంకటేష్ - పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల ’ సినిమా. బాలీవుడ్ లో సూపర్ హిట్టు అయిన ‘ఓ మై గాడ్ ’ చిత్రాన్ని వీరిద్దరి కాంబినేషన్లో రీమేక్ చేస్తున్నారు. వాస్త వానికి ఈ చిత్ర షూటింగు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా, పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్ ముగియడంతో నేడు ముహూర్తం కుదిరింది. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు ఉదయం 9 గంటల 20 నిమిషాలకి హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో వైభవంగా ప్రారంభమైంది.

నేటి నుంచి షూటింగ్ నిరవధికంగా జరుగుతుందని చిత్ర నిర్మాతలు సురేష్ బాబు, శరత్ మరార్ తెలిపారు. ఈ సినిమాకి చాలా టైటిల్స్‌ ప్రచారంలోకి వచ్చినా చివరకు ‘గోపాల గోపాల’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కిషోర్‌ పార్దసాని (డాలి) దర్శకత్వంలో రూపొందబోతుంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పలువురు చిత్ర ప్రముఖులు విచ్చేశారు. వెంకటేష్ తనయుడు మాస్టర్ అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సినిమాలో శ్రియా కథానాయికగా నటిస్తోంది.

పవన్ కి జోడిగా కథానాయికను ఎంపిక చేయలేదు. ‘అత్తారింటికి దారేది ’ చిత్రం తరువాత పవన్ కళ్యాణ్  చేసే చిత్రం ఇదే. గబ్బర్ సింగ్ -2 చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకున్నా ఇంత వరకు సెట్స్ కి వెళ్లలేదు. త్వరలో ఆ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గోపాల గోపాల’ సినిమా తో అటు వెంకటేష్‌ అభిమానులు, ఇటు పవన్‌ అభిమానులు గోల గోల చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles