Alia bhatt in akhil akkineni debut film

akhil akkineni, alia bhatt, deva katta, ashwini dutt, nagarjuna, khil akkineni, akhil akkineni alia bhatt, akhil akkineni next movie, akhil akkineni first movie, akhil akkineni debut, Deva Katta , Ashwini Dutt

Akhil Akkineni and Alia Bhatt romancing on the screen upcoming Telugu Movie.

అఖిల్ అక్కినేని సరసన లేలేత అందాల పిల్ల

Posted: 06/05/2014 04:37 PM IST
Alia bhatt in akhil akkineni debut film

టాలీవుడ్ వెండితెర పై ఇటీవలే గెస్ట్ రోల్ ద్వారా అరంగ్రేటం చేసిన అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈయన సరసన నటించే హీరోయిన్ ఎవరు ? ఏ హీరో కూతురు లేదా హీరోయిన్ కూతురు అఖిల్ కి జంటగా నటించబోతుందంటూ ఆరా తీసి ఫలానా ఆమె నటించబోతుందంటూ పేర్లు కూడా చెప్పేస్తున్నారు.

తొలి ఎంట్రీలోనే మాస్ అండ్ రొమాంటిక్ లుక్ తో అందర్ని ఆకట్టుకున్న అఖిల్ సరసన బాలీవుడ్ దర్శక నిర్మాత అయిన మహేష్ భట్ కూతురు ఆలియా భట్ ని తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు నటించిన రెండు సినిమాలతోనే మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మోతాదుకు మించిన అందాలు ఆరబోయడంలో అడ్డు చెప్పని ఈ పందొమ్మిది సంవత్సరాల లేత పిల్ల అయితే సెక్సీగా, ఫ్రెష్ గా బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈమెను సంప్రదించి కథ చెప్పి, భారీగా రెమ్యునరేషన్ ఇవ్వజూపడంతో ముందు వెనకా ఏ మాత్రం ఆలోచించకుండా అఖిల్ సరసన చేయడానికి ఓకే చెప్పిందని అంటున్నారు.

మొదట్లో అందాల సుందరి శ్రీదేవి కూతుర్ని గానీ, నాగబాబు కూతుర్ని గానీ అఖిల్ సరసన  నటింపజేస్తారని వార్తలు వచ్చినా చివరకు ఈ అవకాశాన్నిఅలియా భట్ ని వరించింది. ఇక దేవా కట్టా దర్శకత్వం వహించబోయే సినిమా గ్రౌండ్ అంతా దాదాపు చివరి దశకు వచ్చిందట. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అయిన  వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ కు నాగార్జున అప్పజెబుతున్నట్టు చెబుతున్నారు.

అశ్వనీదత్ హ్యాండ్ మంచిదన్న సెంటిమెంటుతోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడట. గతంలో ఆయన చేతుల మీదుగా పరిచయమైన మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వాళ్లు స్టార్లుగా ఎదిగిన సంగతి మనకు తెలిసిందే. మరి అఖిల్ టాలీవుడ్ లో ఎంతటి స్టార్ హీరో అవుతాడో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles