Project with mani ratnam still on says mahesh

Superstar Mahesh Babu, Mahesh with Mani Ratnam, Mani Ratnam Mahesh project still on, Mahesh conform koratala shiva film, Mahesh film with trivikram,

Mahesh says the dates are being worked out and they plan to start shooting soon with Mani ratnam movie.

మణితో నేను రెడీ : మహేష్ బాబు

Posted: 06/05/2014 01:07 PM IST
Project with mani ratnam still on says mahesh

మహేష్ బాబు - శీను వైట్ల కాంబినేషనల్లో వస్తున్న ‘ఆగడు ’ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ డైలాగ్స్ ఫ్యాన్స్ ని అలరిస్తున్నా, ఆ డైలాగుల పై పవన్  ఫ్యాన్స్ కి, మహేష్ ఫ్యాన్స్ కి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.

దీని పై ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మహేష్ బాబు మాట్లాడుతూ... పులులు, సింహాలు అంటే తనకేమీ చిన్నచూపు లేదని, నేను గానీ, దర్శకుడు గానీ ఎవరినీ దృష్టిలో పెట్టుకుని ఆ డైలాగ్స్‌ వాడలేదని చెప్పుకొచ్చాడు. మహేష్ ఇంత క్లారిటీ ఇచ్చాక ఫ్యాన్స్ మధ్య వార్ కి పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. ఆ సంగతి ప్రక్కన పెడితే... ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

తాను త్వరలో కొరటాల శివతో ఒకటి, తివిక్రమ్ తో ఒకటి రెండు సినిమాలు చేయబోతున్నానని, దర్శకుడు మణిరత్నంతో ప్రాజెక్టు ఆగిపోలేదని, చర్చల దశలో వుందని, నిజానికి ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని, ఎందుకు ఆగిందో తనకుతెలియదని మహెష్ వెల్లడించారు. మహేష్ చెబుతున్న దాని ప్రకారం చూస్తుంటే మణితో మహేష్ చేయడానికి సిద్దంగా ఉన్నా, నాగార్జునే ఈ సినిమా నుండి తప్పుకొని మీడియాకు స్టేట్ మెంట్ ఇచ్చాడని అంటున్నారు.

మరి మహేష్-మణి కాంబినేషన్ తెరకెక్కే ఈ సినిమాలో రెండో హీరో ఎవరో ? ఈ ప్రాజెక్టును మహేష్ గానీ, మణిగానీ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles