Mahesh babu aagadu teaser ready for release

Mahesh Babu Aagadu teaser, Aagadu 45 seconds teaser release date, Mahesh Babu, Sreenu Vaitla, S.S. Tamannaah

Mahesh Babu first look poster and teaser of the film will be released on May 31st, on the occasion of Krishna birthday. A 45 sec teaser is getting ready.

మహేష్ ‘ఆగడు ’ టీజర్ రెడీ

Posted: 05/27/2014 04:02 PM IST
Mahesh babu aagadu teaser ready for release

‘వన్ ’ మూవీ కాస్తంత నిరాశ పరచడంతో డీలా పడిన ఘట్టమనేని అభిమానుల సందడి మళ్ళీ మొదలు కాబోతుంది. ప్రస్తుతం శీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్న ‘ఆగడు ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ , ట్రైలర్ ని సూపర్ స్టార్ క్రిష్ణ బర్త్ డే కానుకగా అభిమానులకు అందించడానికి రెడీ చేశారు. ఈనెల 31వ తేదీన క్రిష్ణ బర్త్ డే రోజున  ఫస్ట్ లుక్ తో పాటు, 45 సెకన్ల ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు.

ఈ ట్రైలర్లో రెండు మూడు శీనువైట్ల మార్క్ ఉన్న డైలాగులు, యాక్షన్ సీన్స్ తో పాటు మహేష్ ని పవర్ ఫుల్ గా ప్రోజక్ట్ చేసే షాట్స్ తో ఈ ట్రైలర్ ని రెడీ చేశారని సమాచారం. తండ్రి బర్త్ డేకు టీజర్ అయితే, మహేష్ బర్త్ డే రోజున ఆడియోను, ఆ తరువాత సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యిందట. దాదాపు చివరి దశకు వచ్చిన ఈ సినిమా షూటింగు శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం లడఖ్ లో లడఖ్... లడఖ్ అని సాగే పాట చిత్రీకరణ జరుగుతోందని, మహేష్ , తమన్నాలపై దర్శకుడు శ్రీను వైట్ల చిత్రీకరిస్తున్నాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles