Akkineni akhil special entry in manam

akkineni akhil special entry in manam, akkineni akhil in manam movie, akkineni akhil movie details, akkineni akhil, manam movie news, akkineni akhil manam movie news, manam movie updates, telugu movie news, manam movie, akkineni nagarjuna, akkineni nagachaitanya, tollywood, akkineni akhil third film, akhil third film, akhil latest movie news

akkineni akhil special entry in manam, akkineni akhil in manam movie, akkineni akhil movie details, akkineni akhil, manam movie news, akkineni akhil manam movie news, manam movie updates, telugu movie news, manam movie, akkineni nagarjuna, akkineni nagachaitanya, tollywood, akkineni akhil third film, akhil third film, akhil latest movie news

త్వరలో అఖిల్ మూడో సినిమా

Posted: 05/24/2014 10:10 AM IST
Akkineni akhil special entry in manam

అక్కినేని అఖిల్ త్వరలోనే హీరోగా ఓ కొత్త సినిమాతో పరిచయం కాబోతున్నాడని అక్కినేని కుటుంబమంతా తెలియజేసింది. అయితే ఇటీవలే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ‘మనం’. ఇందులో అఖిల్ కూడా ఓ సన్నివేశంలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటిని నాగార్జున ఖండిస్తూ అలాంటిదేమి లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. కానీ సీన్ కట్ చేస్తే నిన్న విడుదలైన ‘మనం’ సినిమా చివర్లో అఖిల్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు.

అయితే ఇప్పటికీ కూడా అక్కినేని కుటుంబం ఈ విషయం గురించి లైట్ గా తీసుకుంటుంది. అఖిల్ ది ఇది మొదటి సినిమా ఏం కాదు. ఒకవేళ మీరు అలా భావిస్తే అఖిల్ కి ఇది రెండవ సినిమా అవుతుంది. ఎందుకంటే అఖిల్ చిన్నతనంలో ‘సిసింద్రీ’ సినిమాలో నటించాడు. కాబట్టి మనం సినిమా తనకు రెండవ సినిమా అవుతుందని అక్కినేని వారి అభిప్రాయం. మరీ అక్కినేని అభిమానులు అఖిల్ ను సోలో హీరోగానే చూడాలనుకుంటున్నారు. కాబట్టి తను హీరోగా చేయబోయే సినిమాయే మొదటి సినిమా అని అక్కినేని అభిమానులు అంటున్నారు.

ఏదేమైనా కూడా ఇప్పటికే అఖిల్ లో చాలా మార్పులు వచ్చాయని, ప్రస్తుతం టాలీవుడ్ హీరోకి ఉండాల్సిన లక్షణాలు బాగానే ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నారు. కానీ అఖిల్ మాత్రం తన రాబోయే సినిమా గురించి ఎలాంటి వివరాలు తెలియజేయకపోవడంతో అభిమానులు కాస్త నిరాశగా ఉన్నారు. ప్రస్తుతం అఖిల్ సరైన కథ కోసం ఎదురు చూస్తున్నాడని తెలిసింది. అయితే ఓ స్టైలిష్, యూత్ ఫుల్ లవ్ స్టోరీ చిత్రంతో ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట అఖిల్. మరి ఈ చిన్నోడి ఎంట్రీ ఎప్పడో త్వరలోనే తెలియనుంది.


Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles