Prabhas clears the secret surgery

Prabhas clears the secret surgery, SS Rajamouli, Prabhas,Baahubali, surgery, Prabhas, surgery, Baahubali, rumours, prabhas injured, prabhas undergoes surgery, Prabhas undergoes secret surgery, prabhas facebook, director rajamouli facebook,

Actor Prabhas clears the mystery over secret surgery.

ఇన్నాళ్ళ తరువాత ప్రభాస్ చెప్పేశాడు

Posted: 05/19/2014 12:32 PM IST
Prabhas clears the secret surgery

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి భారీ ప్రాజెక్టు అయిన ‘బాహుబలి ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో భారీ కత్తి యుద్దాలు, గుర్రపు రేసులు ఉన్నాయి. యుద్దాల చిత్రీకరణ సమయంలో ప్రభాస్ కి తీవ్రగాయాలు అయ్యాయని, అందువల్ల ఆయన షూటింగులో పాల్గొనడం లేదని ఆ మధ్యన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దాని పై చిత్ర యూనిట్ కానీ, ప్రభాస్ కానీ పెదవి విప్పకుండా దాచి ఉంచారు. అయితే ఇన్నాళ్ళ తరువాత ప్రభాస్ ఆ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. తనకు షూటింగులో భుజానికి గాయం అయిందని, దానికి సంబంధించిన సర్జరీ జరిగి నెల రోజుల అయ్యిందని, అసలు ఇది ఎప్పుడో చేయించుకోవలసిన ఆపరేషన్ అనీ, అయితే ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ రావడంలో అది ముదిరిపోవడంతో సర్జరీ చేయించుకున్నానని, ప్రస్తుతం కోలుకుంటున్నానని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

అయితే ఈ విషయం పై ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం గరంగరంగా ఉన్నారట. ఇంత పెద్ద గాయం అయినా కనీసం చెప్పుకోకుండా దాచాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారట. మరో నెల రోజుల్లో షూటింగుల్లో పాల్గొంటాననీ, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ చెప్పాడు. ఆయన పై అభిమానులకు ఎంత కోపంగా ఉన్నా, త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles