Kalyan ram n sher film launched

Nandamuri Kalyan Ram sher, Kalyan Rams Sher launched, Nandamuri Hero Kalyan Ram new film Sher, Sher Movie Launched.

Kalyan Ram N Sher film launched, Nandamuri Kalyan Ram sher,

మొదలైన నందమూరి కళ్యాణ్ రామ్ ‘షేర్’!

Posted: 05/14/2014 06:42 PM IST
Kalyan ram n sher film launched

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై ‘కత్తి’ లాంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిఖార్జున్ దర్శకత్వంలో సాయి నిహారిక సమర్పణలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘షేర్’ అని పేరు పెట్టారు.

ఈ చిత్రం షూటింగ్ మే 14 ఉదయం 7 గంటలకు ఫిలింనగర్ దైవసన్నిధానంలోని సాయిబాబా గుడిలో ప్రారంభమైంది. యూనిట్ మెంబెర్స్ పూజా కార్యక్రమాలు జరపగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ క్లాప్ ఇవ్వగా, చిత్ర సమర్పకురాలు బేబీ సాయి నిహారిక కెమెరా స్విచాన్ చేయగా తొలి షాట్ ను షిరిడి సాయిబాబా విగ్రహంపై చిత్రీకరించారు.

ఈ సందర్భంగా దర్శకులు మల్లిఖార్జున్ మాట్లాడుతూ – “నందమూరి కళ్యాణ్ రామ్ ‘షేర్’గా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. కళ్యాణ్ రామ్ గారి బాడీ లాంగ్వే కి తగినట్లుగా ‘షేర్’ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది. కళ్యాణ రామ్ గారితో సూపర్ హిట్ తియ్యాలన్న నా కోరిక ‘షేర్’తో నెరవేరబోతోంది” అన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles