Pawan aaru bramhi as moodu adugula bullet

Pawan Kalyan, Brahmanandam, Pawan Aaru-bramhi as moodu adugula bullet, AttarintikiDaredi, Veedu Moodu Adugula Bullet, comedian Brahmanandam, Brahmanandam new movie, Moodadugula Bullettu.

Pawan Aaru-bramhi as moodu adugula bullet

పవన్ ఆరు- వీడు మూడు?

Posted: 05/14/2014 05:22 PM IST
Pawan aaru bramhi as moodu adugula bullet

టాలీవుడ్ లో ఆరడుగుల బుల్లెట్ అంటే వెంటనే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినబడుతుంది. ఆరడుగుల బుల్లెట్ గా టాలీవుడ్ తెర ను షేక్ చేసిన పవన్ కళ్యాన్ కు.. మూడడుగుల బుల్లెట్ పోటీ పడుతుందని టాలీవుడ్ టాక్. అసలు ఇంతకీ ఈ మూడడుగుల బుల్లెట్ ఎవరంటే? దాదాపు మూడు దశాబ్దాల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అప్పట్నుంచీ ఇప్పటి వరకూ సూపర్‌స్టార్ కమెడియన్‌ గా బుల్లెట్‌ లా దూసుకుపోతున్నారు 'బ్రహ్మానందం'. బ్రహ్మానందానికి వయసు పెరుగుతున్న కొద్దీ ఇమేజ్ కూడా బాగా పెరిగిపోతోంది.

మూడు దశాబ్దాలైనా ఇంకా ఫేడౌట్ అవలేదు సరికదా... ఇంకా ఇంకా బిజీ అవుతున్నాడు. స్టార్ హీరోలకు ఉన్నంత ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరు హీరోలకు తానే కామెడీ ఇవ్వాల్సివస్తోంది. ఇప్పుడు సక్సెస్ అవుతున్న ప్రతీ సినిమాల్లోనూ బ్రహ్మీదే కీలక పాత్ర. ఒకరకంగా చెప్పాలంటే.. వాళ్ల విజయాలను కూడా తానే మోస్తున్నాడు. అందుకే, ఇప్పుడు ఆయనని హీరోగా పెట్టి ప్రత్యేకంగా కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి.

ఇందులో భాగంగానే.. ఇప్పుడు బ్రహ్మీ 'మూడడుగుల బుల్లెట్టు'గా రాబోతున్నాడు. 'అత్తారింటికి దారేదీ' సినిమాలోని 'వీడు ... ఆరడుగుల బుల్లెట్టు' పాట బాగా పాపులర్ అవడంతో, బ్రహ్మీకి ఈ టైటిల్ సెట్ చేశారు. మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో బ్రహ్మానందం పాత్ర ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంటుందట. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైందని టాలీవుడ్ టాక్.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles