Malaika arora item song for hubby arbaaz khan

Malaika Arora,Arbaaz Khan,Sonam Kapoor,Dolly Ki Doli,Malaika Arora Munni Badnaam , Malaika Arora hubby Arbaaz Khan, Dolly Ki Doli, Malaika Arora Khan, Sonam Kapoor movie Dolly Ki Doli

Producer Arbaaz Khan’ is planning to rope in his glamorous wife Malaika Arora for an item song.

భర్త కోసం ఐటెం సాంగులో మలైకా

Posted: 05/09/2014 02:59 PM IST
Malaika arora item song for hubby arbaaz khan

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ అయిన ఐటెం సాంగ్స్ తప్పనిసరి ఉండే విధంగా చూసుకుంటున్నారు దర్శకులు. వీటి క్రేజ్ బాలీవుడ్ లో కాస్తంత ఎక్కువ. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ నుండి ఐటెం గాళ్స్ వరకు అందరు ఐటెం సాంగ్స్ అనగానే కాసిన్ని కాసులు ఎక్కువ తీసుకొని సై అంటారు. ఎంత మంది టాప్ హీరోయిన్స్ ఐటెం సాంగుల్లో నటించినా బాలీవుడ్ ఐటెంగాళ్ గా ఫేం అయిన మలైక అరోరా స్టైలే డిఫరెంట్.

ఈమె ఐటెంగాళ్ గా నటించిన  సల్మాన్ దబాంగ్ లో మున్నీ బదనామ్ హూయి పాట, తెలుగులో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక సాంగ్ ఎంత పాపులారిటి పొందాయో అందరికి తెలిసిందే. పెళ్లయి, ఇద్దరు పిల్లలకు తల్లయిన కూడా తన హవా కొనసాగిస్తోంది. తాజాగా భర్త అర్భాజ్ ఖాన్ నిర్మిస్తున్న ‘ డాలీ కీ డాలి ’ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో నర్తించేందుకు తన భర్త కోరిక  మేరకు సిద్ధమైందట.

సంగీత దర్శక ద్వయం సాజిద్-వాజిద్ కంపోజ్ చేస్తున్న ఓ మాస్ డాన్స్ నంబర్ ను మలైకాతో చేయిస్తే బాగుంటుందని అనుకుంటుందని భావించి ఈమెతో ఆ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సైఫ్ గెస్ట్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు మలైకా గ్లామర్ మరింత అందాన్ని తెస్తుందని ఆ చిత్ర యూనిట్ భావిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles