I am too honest to get into politics says amala

Narendra Modi,Nagarjuna,Amala Akkineni politics,Amala Akkineni Blue Cross,Amala Akkineni

Amala Akkineni has finally broken her silence about rumours that she's going to contest in elections this year and she confesses that she too honest to get into politics.

నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు

Posted: 04/09/2014 09:54 AM IST
I am too honest to get into politics says amala

గత కొంత కాలంగా అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల రాజకీయ అరంగ్రేటం చేయబోతుందని, ప్రస్తుతం నమో గాలి వీస్తున్న తరుణంలో ఆమె బీజేపీలో చేరి విజయవాడ నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతుందని, ఆ వార్తలకు బలం చేకూరే విధంగా ఇటీవలి కాలంలో నాగార్జున నరేంద్రమోదీని కలవడంతో ఈమె రాజకీయ అరంగ్రేటం ఖాయం అని అందరు ఫిక్స్ అయ్యారు.

కానీ ఇప్పుడు ఆ వార్తలను ఆమె స్వయంగా ఓ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖండించి, స్టాప్ పెట్టారు. ప్రస్తుతం తాను చేస్తున్న సమాజ సేవ కార్యక్రమాల్లో నిజాయితీగా ఉంటూ... చాలా సంతోషంగా ఉన్నానని, అలాంటి నేను రాజకీయాల్లో వుండలేనని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, అమలా చెప్పుకొచ్చారు.

అమలా ఇలా అనడానికి ఓ కారణం కూడా చెబుతున్నారు రాజకీయ సినీ విశ్లేషకులు. తాను ఆశించిన విజయవాడ ఎంపీ సీటు టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్లడంతో అసంత్రుప్తితో ఉన్న ఆమె ఇలాంటి ప్రకటన చేసిందని అంటున్నారు. ఏదేమైనా అమలా ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles