మెగా ఫ్యాన్స్ మద్య విభేదాలు వచ్చినట్లు కొంత మంది అంటున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ మద్య కూడా విభేదాలు ముదిరినట్లుగా ఉందని సినీజనాలు అంటున్నారు. అలాంటి మాటలు నిజం కాదని మెగా ఫ్యాన్స్ రుజువు చేస్తున్నారు.
ఒకే రోజు మెగా హీరోలు అభిమానులతో సందడి చేయబోతున్నారు. మెగా పవర్ రామ్ చరణ్ పగలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాత్రి అభిమానులతో మెగా సందడి చేయటానికి సిద్దమయ్యారు. అంటే రేపు మెగా అన్నయ్య తనయుడు రామ్ చరణ్ పుట్టిన రోజు. అలాగే మెగా అన్నయ్య తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తొలి భారీ సభ జరుగుతుంది.
ఈ రెండు కార్యక్రమాలకు మెగా అభిమానులు ఆనందంతో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ ఓ వైపు తన అభిమానులతో చర్చలు జరుపుతుండగా మరోవైపు అబ్బాయ్ కూడా మెగా అభిమానులతో చర్చలు జరపనున్నారు. ఈ ఇద్దరు కూడా ఈ చర్చల విషయంలో బిజీ గా ఉన్నారు.
రేపు విశాఖ నగర తీరాన పవన్ జనసేన బహిరంగ సభ ఏర్పాటు చేయగా అదే సమయంలో చరణ్ హైదరాబాద్ లో తన అభిమానులతో సమావేశమౌతున్నారు. ప్రతి సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు.. అభిమానులు రక్తదానం చేయటం, కొన్ని సేవా కార్యక్రమాలు చేయటం అనావయితీగా వస్తుంది. అంతేకాకుండా మెగా అభిమానులు రామ్ చరణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పటానికి హైదబాద్ వస్తున్నారు.
అదే రోజు సాయంత్రం జరిగే పవన్ కళ్యాణ్ సభకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ విధి విధానాలు మరింత స్పష్టంగా అశేష అభిమానుల మద్య పవన్ ప్రకటించనున్నాడు పవన్. ఆ మేరకు భారీ ఏర్పాట్లు చేసారునిర్వాహకులు ,ఈ వేదికపైనే తన మిత్రుడితో కలిసి రాసిన 'ఇజం 'పుస్తకావిష్కరణ చేయనున్నారు.
అయితే అబ్బాయ్, బాబాయ్ ల మద్య ఏదో ఉందని కొన్ని వెబ్ సైట్లు రాస్తున్నాయి. కానీ అలాంటి వార్తల్లో నిజం లేదని మెగా అభిమానులు అంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more