Auto nagar surya lands in legal troubles

Auto nagar Surya movie, Auto Nagar Surya legal troubles, Guntur Magistrate court orders to Autonagar surya

Court ordered the producers to pay the debts in order to release Autonagar Surya.

ఆటో ఇక విడుదల అవ్వడం కష్టమే

Posted: 03/07/2014 10:26 AM IST
Auto nagar surya lands in legal troubles

అక్కినేని నాగచైతన్య హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ‘మ్యాక్స్ ఇండియా ’ పొడక్షన్ పతాకం పై అచ్చిరెడ్డి నిర్మించిన ఆటోనగర్ సూర్య సినిమా ఇంత వరకు విడుదల నోచుకోలేదు. ఇటీవల ఈ సినిమాను ఈనెల 9వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు.

కానీ గుంటూరు కోర్టు విడుదలను అడ్డుకుంది. దీంతో ఈ సినిమా అటకెక్కినట్లే అని అనుకుంటున్నారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో లావా దేవీలకు సంబందించి షేక్ అబ్దుల్ అనే వ్యక్తి సినిమా విడుదలను ఆపి వేయాలని కోర్టులో కేసు వేయడంతో ఈ సినిమా విడుదలను ఈనెల 18 వరకు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, నిర్మాత అచ్చిరెడ్డిని కోర్టులో హాజరు కావాలని కోరింది.

ఈ సినిమా నిర్మాణ వ్యయంలో అబ్దుల్ అనే వ్యక్తి రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాడని ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. ఈ డబ్బులు తిరిగి చెల్లించే విషయంలో ప్రొడక్షన్, నిర్మాత తనను మోసం చేశారని అబ్దుల్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడ్డ ‘ఆటో ’ ముందుకు కదలాలంటే ఎవరైనా డబ్బులు పోయాల్సిందే.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles