Ali join in tdp contest from rajahmundry

Comedian Ali To Join Politics, Ali in Politics, Elections, Tollywood Industry,

Comedian Ali To Join Politics. Ali is one of the best comedians of Tollywood industry. He acted in Telugu films even as a child actor also.

పసుపు పార్టీలో ఆలీ - సొంతూరు నుండి పోటీ

Posted: 02/26/2014 12:43 PM IST
Ali join in tdp contest from rajahmundry

సినీ నటుల వ్రుత్తి నటన అయితే... ప్రవ్రుత్తి రాజకీయం. ఇప్పటి వరకు సినీ రంగానికి చెందిన వారు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి తన అద్రుష్టాన్ని పరీక్షించుకున్నారు. పరీక్షించుకోబోతున్నారు. త్వరలో లోక్ సభ, శాసన సభ ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్న నేపథ్యంలో కొంత మంది నటులు తన ప్రయత్నాల్ని మొదలు పెట్టారు.

ఇప్పుడు కమేడియన్ ఆలీ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడు. గత కొన్నాళ్ళ నుండి తన పై వచ్చిన వార్తలను నిజం చేస్తూ... ఆలీ ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేశాడు.  తాను సొంతూరు రాజమండ్రికి వచ్చిన సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. ఈయన ఏ పార్టీలో చేరబోతున్నారంటే... రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు. ఈ విషయం పై త్వరలో చంద్రబాబును కలుస్తాడని, పార్టీలో చేరే తేదీని అధికారికంగా ప్రకటిస్తాడని అంటున్నారు.

టీడీపీలో చేరి రాజమండ్రి నగర నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే రాజమండ్రి ఎంపీ స్థానానికి టీడీపీ నుంచి మురళీ మోహన్‌ బరిలో ఉన్నారు. ఎమ్మెల్యేగా ఆలీని ప్రకటిస్తే అక్కడ రెండు గెలవొచ్చని విశ్లేషకులు అంటున్నారు. సినిమాల్లో సూపర్ సక్సెస్ అయిన ఆలీ రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles