India today special magazine of pawan

Pawan Kalyan in India Today, Special Magazine, india today special article, india today Magazine, Powerful Star-Smile and Smart Star, pawan kalyan, india today 120 page article on pawan, p

India Today Special Magazine of Pawan. India Today Magazine is about to publish a Pawan Kalyan exclusive with 120 pages.

పవన్ కళ్యాణ్ నిజాలు అన్నీ బయటికొస్తాయా ?

Posted: 01/30/2014 02:47 PM IST
India today special magazine of pawan

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇంటస్ట్రీలో కానీ, ప్రేక్షకుల్లో కానీ ఎంత క్రేజ్ ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమా వచ్చినా, ఏదైనా సినిమా ఫంక్షన్ కి వచ్చినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది ప్రముఖ జాతీయ పత్రిక ‘ఇండియా టుడే ’. ఈ పత్రిక వచ్చే నెల సంచికను పవన్ కళ్యాణ్  ‘పవర్ ఫుల్ స్టార్-స్మైల్ అండ్ స్మార్ట్ స్టార్ ’ అనే ట్యగ్ లైన్ తో విడుదల చేయబోతుంది.

ఈ సంచికలో ఆయన ప్రొఫైల్ మొదలుకొని ఆయన వ్యక్తిత్వం, సినీ విశేషాలు, వ్యక్తిగత వివరాలు, వివాదాలు, ఇష్టాఇష్టాలు, కెరియర్ ఎత్తు పల్లాల పై సమగ్రంగా ప్రచురించనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వివాహ బంధం మొదటిది, రెండవది, ఇటీవలే వచ్చిన మూడో దాని పై కూడా ఇందులో విశ్లేషిస్తారని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇందుకోసం పవన్ కల్యాణ్ తో ప్రత్యేకమైన ఫోటో సెషన్ కూడా నిర్వహించినట్టు చెబుతున్నారు. పవన్ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరూ చూడని ఫోటోలను కూడా ఇందులో ఉంచనున్నట్లు సమాచారం.

గతంలో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబులపై ఇలా ఇండియా టుడే ప్రత్యేక సంచికలు రిలీజ్ చేసింది. పవన్ కల్యాణ్ సంచిక కాబట్టి పత్రిక అమ్మకాలు విశేషంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఒకవేళ అందులో ఏమైనా ఫ్యాన్స్ ని హర్ట్ చేసే విధంగా రాస్తే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా అంటున్నారు. చూద్దాం త్వరలో విడుదల అయ్యే ఈ సంచిన ఎన్ని సంచలనాలు రేపుతుందో.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles