Balakrishna legend first look released

Balakrishna Legend first look, Nandamuri Balakrishna, Boyapati Srinu, Legend, Simha, N B Ks, Legend First look released.

First look still of Nandamuri Balakrishna from his current film, Legend. The first still was released today (December 31, 2013).

బాలక్రిష్ణ ‘లెజెండ్ ’ ఫస్ట్ లుక్

Posted: 12/31/2013 07:20 PM IST
Balakrishna legend first look released

నందమూరి అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ‘లెజెండ్ ’ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. బోయపాటి శీను దర్శకత్వంలో  వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని నూతన సంవత్సర కానుకగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు బొయపాటి శీను మాట్లాడుతూ పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని, బాలయ్యతో రెండో చిత్రంతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ చిత్రం కూడా ‘సింహా ’ లాంటి బ్లాక్ బ్లస్టర్ ఇస్తుందని, ఈ సినిమా పై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్లే ఈ సినిమాను రూపొందిస్తున్నామని చెప్పారు.

తొలిసారి విలన్ పాత్ర పోషిస్తున్న జగపతి బాబు మాట్లాడుతూ... బాలయ్య సినిమాలో విలన్ పాత్ర పోషించిడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు హీరోగా మీముందున్న నేను ఇక పై విలన్ పాత్రల్లో కూడా కనిపిస్తానని, ఈ పాత్ర నా  కెరియర్ కి మలుపు తిప్పే పాత్ర అవుతుందని అన్నారు.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ సినిమా లో బాలయ్య సరసన రాధికా ఆప్టే , సోనాల్ చౌహాన్ లు నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయే విధంగా ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles