Charan second hindi film with deepika

Charan second hindi film, Ram Charan, Hero Ram Charan Bollywood Movies , Ram Charan with deepika Padukone, Ashutosh Gowarikar film

Charan second movie in B-Town and it was going to direct by Lagan movie fame Ashutosh Gowarikar and this time it was planning in a Big scale budget and movie will go on to the floors.

రామ్ చరణ్ దీపికాతో రొమాన్స్

Posted: 12/28/2013 12:00 PM IST
Charan second hindi film with deepika

పోయిన దగ్గరే వెతుక్కోవాలనుకుంటున్నాడు టాలీవుడ్ హీరో రామ్ చరణ్. టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న చరణ్ ఆ మధ్యన బాలీవుడ్ లో అడుగు పెట్టి ‘జంజీర్ ’ సినిమాతో  అక్కడ తన అద్రుష్టాన్ని పరీక్షించుకున్నాడు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న చరణ్ కి ఆ సినిమా హిట్టివ్వక పోగా ఈ సంవత్సరానికి గాను బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రంలో మొదటి స్థానంలో నిలవడంతో ఇటు ఫ్యాన్స్, అటు హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆగ్రహానికి గురయ్యాడు. అయితే ఏ మాత్రం ధైర్యం చెడని చరణ్ బాలీవుడ్ లో రెండో ట్రయల్ వేయడానికి సిద్దం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు, ‘లగాన్’ ఫేం అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ విషయాన్ని చరణ్ కూడా తాజాగా కన్ఫర్మ్ చేశాడు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో మొదలు కావాల్సి ఉన్నా, జంజీర్ ఇచ్చిన ఝలక్ నుండి తేరుకోవడవానికి ఇన్ని రోజులు పట్టింది. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే చరణ్ తో దీపికా పదుకునే జోడి కట్టబోతుందని, దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయనే వార్తలు బాలీవుడ్ నుండి వినిపిస్తున్నాయి.

ఈ వార్తల పై చరణ్ స్పందిస్తే గానీ అసలు విషయం తెలియదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles