Sameera engaged with akshai

Sameera Reddy, akshai varde, sameera reddy engagement, akshai varde engagement, Balakrishna film, Legend bike, Oh My God movie

Sameera Reddy is engaged to Akshai Varde, who runs a company that builds custom-made bikes.

సమీరా రెడ్డి పెళ్ళి కుదిరింది

Posted: 12/27/2013 01:39 PM IST
Sameera engaged with akshai

బాలీవుడ్ హీరోయిన్ అయినా టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించడమే కాకుండా, జూనియర్ ఎన్టీఆర్ తో ప్రేమ వ్యవహారం నడిపిందనే వార్తలతో బాగా పాపులర్ అయిన నటి సమీరా రెడ్డి త్వరలో ఓ ఇంటిది కాబోతుంది. ఈ అమ్మడి నిశ్చితార్థం ప్రముఖ వ్యాపార వేత్త, బైక్స్ డిజైన్స్ కంపెనీ ఓనర్ అయిన అక్షయ్ వర్దేతో డిసెంబర్ 14నే అత్యంత సన్నిహితులు, ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో జరిగినట్లు తెలుస్తుంది.

గత కొన్నాళ్ళుగా అక్షయ్ తో సమీరా ప్రేమ వ్యవహారం నడుపుతోందనీ, వీరిద్దరు కలిసి కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేశారని, ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారట. పలు హిందీ, తెలుగు, తమిళ సినిమాలలో నటించినప్పటికీ సమీరా జూనియర్ తో నడిపిన ఎఫైర్ తోనే టాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యింది.

ఇక అక్షయ్ విషయానికి వస్తే... ఈయనకు బైక్ డిజైనింగ్ కంపెనే కాకుండా, సినిమా ఇండస్ట్రీతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఈయన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ చిత్రంలోని బైక్ ని, ప్రస్తుతం బాలక్రిష్ణ నటిస్తున్న ‘లెజెండ్ ’సినిమాలోని బైక్ ని డిజైన్ చేశాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles