Pawan as chief guest for rey audio

pawan kalyan Rey audio, pawan chief Guest, rey audio launch, pawan Kalyan, rey audio launch, pawan to launch Rey audio, pawan chief guest

Film maker YVS Chowdary definitely had those guts to enter into a very big budget film with debutant Sai Dharamteja as hero.grand function in the presence of Power Star Pawan Kalyan.

సాయి ధరమ్ తేజ్ కోసం పవన్ వస్తాడా ?

Posted: 12/18/2013 11:02 AM IST
Pawan as chief guest for rey audio

చిన్న హీరోల సినిమాలకు పబ్లిసిటీ తీసుకొని రావడానికి దర్శక, నిర్మాతలు పెద్ద పెద్ద స్టార్లను ఆడియో ఫంక్షన్లకు, ప్లాటినమ్ డిస్క్ పంక్షన్లకు ఆహ్వానిస్తుంటారు. మరి మెగా ఫ్యామిలీ నుండి వచ్చే హీరోలకు సాధారణంగా పబ్లిసిటీ అవసరం లేదు. కానీ మరింత పబ్లిసిటీ తీసుకొని రావడానికి మెగా హీరోను ఆహ్వానిస్తున్నాడు దర్శక నిర్మాత వై.వి.యస్. చౌదరి.

ఈయన దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘రేయ్ ’ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు అయిన సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. చాలా కాలం క్రితం షూటింగు మొదలయ్యి ఇంకా సాగుతూ ఉన్న ఈ చిత్రం ఆడియోను ఎట్టకేలకు విడుదల చేయడానికి పూనుకున్నారు. త్వరలో విడుదల చేయబోయే ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ కి గెస్ట్ గా ‘పవన్ కళ్యాణ్ ’ ని పిలిచి సినిమాకు హైప్ తీసుకొని రావడానికి స్కెచ్ వేశాడట.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని నాగబాబు చేత విడుదల చేయించి కాస్తంత సఫలం అయిన చౌదరి ఇప్పుడు పవన్ ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడట. పవన్ కి మేనల్లుడు కావడంతో ఆడియోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్న పవన్ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. ఒకవేళ వస్తే సినిమాకి పుల్ పబ్లిసిటీ రావడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles