Pawan kalyan to attend icffi closing ceremony

Tollywood Pawan Kalyan, International Children Film Festival India, ICFFI Closing Ceremony, special guest

Well-known film star Pawan Kalyan will attend the closing ceremony at the Lalitha Kala Thornam at public gardens this evening as a special invitee.

పవన్ ఘనంగా ముగించబోతున్నాడు

Posted: 11/20/2013 04:31 PM IST
Pawan kalyan to attend icffi closing ceremony

అంతర్జాతీయ బాలల దినోత్సవ ఫెస్టివల్ ఈనెల 14 తేదీన హైదరాబాద్ లో ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ లాంటి వారే కాకుండా చాలా మంది ప్రముఖుల మధ్య అట్టహాసంగా ప్రారంభం అయింది. కానీ చిల్డ్రన్ ఫెస్టివల్ కి మీడియా వారు అనుకున్నంత కవరేజ్ ఇవ్వలేక పోయింది. కారణం రాష్ట్రంలో ఈ ఫెస్టివల్ కంటే ఎక్కువ హాట్ హాట్ న్యూస్ ఉండటమే.

దీంతో అటు వైపు కెమెరా కన్ను పడకపోవడంతో ఈ ఫెస్టివల్ ఇప్పటి వరకు చప్పగా, నిర్సారంగా సాగుతున్నాయి. అదీ కాకుండా మన నగరంలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ కి మన టాలీవుడ్ సెలబ్రెటీలు ఎవరూ వెళ్ళకపోవడంతో ఈ ప్రోగ్రాం కళ తప్పిందనే విమర్శలు వినిపించడంతో వీటికి ఎలా జోష్ పెంచాలనే దిశగా ముఖ్యమంత్రి కిరణ్ కుమారెడ్డి రెడ్డి ఆలోచించి, టాలీవుడ్ లో ఉన్న విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ని ఈ కార్యక్రమం ముగింపు కి ఆహ్వానించాడని, పిల్లల కోసం పవన్ కూడా ఒప్పేసుకున్నాడని అంటున్నారు.

నేడు అనగా (బుధవారం) జరిగే ఈ ముగింపు కార్యక్రమానికి పవన్ గెస్ట్ హాజరు అయ్యి ఈ చిత్రోత్సవాన్ని ఘనంగా ముగించబోతున్నాడని అంటున్నారు. ఈ వార్తలే నిజమైతే పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న మొట్టమొదటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అవుతుంది. మొత్తానికి ప్రారంభం ఎలా ఉన్నా.. చిత్రోత్సవం ముగింపు మాత్రం అదిరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది ఫుల్ జోష్ తో ముగిసిపోనుందన్న మాట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles