Krrish 3 crosses rs100 crore mark

Krrish 3 crosses Rs100 crore, Hrithik Roshan,Kangna Ranaut,Krrish 3,Rakesh Roshan

Bollywood heartthrob Hrithik Roshan starrer Krrish 3 has crossed the Rs.100 crore mark in four days.

నాలుగు రోజుల్లోనే 100 కోట్లు

Posted: 11/05/2013 07:39 PM IST
Krrish 3 crosses rs100 crore mark

బాలీవుడ్ లో హృతిక్ నటించిన క్రిష్-3 చిత్రం రికార్డుల మోత మోగిస్తూ దూసుకుపోతుంది. రాకేష్ రోషన్ దర్శకత్వంలో అంత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల అయిన నాలుగు రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటి రికార్డులు క్రియేట్ చేసింది. ఆ మధ్య షారూఖ్ ఖాన్ నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’ కూడా  ఎక్స్ ప్రెస్ లెవల్లో రికార్డు కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు బాలీవుడ్ లో డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో మాత్రం దూసుకుపోతుంది. తొలిరోజు 25. 20, రెండో రోజు 23. 2, మూడో రోజు 24. 30 కోట్లు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఈ చిత్ర విజయం, సాధిస్తున్న కలెక్షన్ల పై ఆ చిత్ర దర్శక, నిర్మాత అయిన రాకేష్ రోషన్ మాట్లాడుతూ...ఈ సినిమాలో ముగ్గురు సూపర్ హీరోలు ఉండటం వల్లే ఈ సినిమా ఇన్ని వసూళ్ళు సాధించిందని అందులో  ఒకరు హృతిక్ రోషన్, రెండు వివేక్ ఒబేరాయ్, మూడు ప్రేక్షకులు అని తెలిపారు. ఇందులో హృతిక్ సరసన ప్రియాంకా చోప్రా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు ముందు రాకేష్ రోషన్ ఈ సినిమా టార్గెట్ వెయ్యికోట్లు అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles