Aishwarya rai out priyanka chopra to do item song in ram leela

Priyanka Chopra to do item song in Ram Leela, Sanjay Leela Bhansali, Priyanka Chopra,| Ram Leela, Aishwarya Rai Bachchan, Deepika Padukone

Another item song in Priyanka kitty. Replaces Aishwarya in Sanjay Leela Bhansali upcoming Ram Leela.

ఆంటీకి ఎసరు పెట్టిన అందాల సుందరి

Posted: 08/22/2013 05:45 PM IST
Aishwarya rai out priyanka chopra to do item song in ram leela

సినిమాల్లో ఐటెం గర్ల్స్ కి స్టార్ హీరోయిన్లే పెద్ద కాంపిటీటర్స్ గా మారిపోయారు. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ చేయడానికి హీరోయిన్లు వెనకడుగు వేసేవారు. ఐటెం సాంగ్స్ కోసం మంచి సెక్సీ ఫిగర్ ఉన్న భామను ఎంచుకునే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలా చేయడాన్ని వారు ఒక స్టేటస్ గా కూడా ఫీలవడమే కాకుండా, సినిమాకు తీసుకునేంత పారితోషికాన్ని తీసుకుంటున్నారు. పైగా నాలుగు ఐదు రోజలు కష్టపడి ఒంట్లోని ఒంపుసొంపుల్ని చూసిస్తే చాలు. కోట్లు అకౌంట్లోకి వచ్చి పడటంతో ఎక్కువ మంది ఐటెం సాంగ్స్ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి ప్రియాంకా చోప్రా కూడా వచ్చి చేరింది. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంటగా సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న 'రామ్ లీలా' సినిమాలో ప్రియాంక ఐటెం చేయనుంది. విశేషం ఏమిటంటే, ఈ పాట కోసం ఇటీవల ఐశ్వర్యా రాయ్ తో దర్శకుడు చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఆమె కూడా చేయడానికి అంగీకరించినట్టు ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు ఐశ్వర్య చేయడం లేదని స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఆ వార్తలకు పుల్ స్టాప్ పడి,  ఐష్ స్థానంలోకి ప్రియాంకా వచ్చింది. నిన్న మొన్న వచ్చిన సోనాక్షి ఒంపుసొంపులు చూపించడానికి 6 కోట్ల వరకు తీసుకుంటుంది. మరి ప్రియాంక ఎన్ని కోట్లు ఇస్తే ఒంట్లో అందాల్ని చూపిస్తుందోనని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles