Hero gopichand green signal to deva katta

Hero gopichand green signal to Deva Katta, Manly Hero with Deva Katta, deva katta new movie with gopichand,deva katta new movie details

Hero gopichand green signal to Deva Katta, Manly Hero with Deva Katta, deva katta new movie with gopichand,deva katta new movie details

దేవా కట్టాతో కమీట్ అయ్యాడు

Posted: 08/16/2013 11:49 AM IST
Hero gopichand green signal to deva katta

టాలీవుడ్ లో మాస్, యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకొన్న గోపీచంద్ గత కొంత కాలం నుండి సినిమాల్లో వెనకబడి పోయాడు. కారణం తాను నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడమే. చాలా కాలం తరువాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో ‘సాహసం ’ సినిమా చేశాడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించినా కానీ కలెక్షన్లు మాత్రం కాస్తంత వీక్ గా వచ్చాయి. ఇక ఈ చిత్రం తరువాత గోపీచంద్ బి.గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమీట్ అయ్యాడు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఈ సినిమా ప్రారంభం కాకముందే మరో సినిమాకు ఓకే చెప్పేశాడు. ప్రస్థానం సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవాకట్టా తాను దర్శకత్వం వహించిన ఆటోనగర్ సూర్య చిత్రం అర్థాంతరంగా పోవడంతో దాన్ని పూర్తిగా మరచి పోయి మరో కొత్త కథను రాసుకొని గోపీచంద్ కి వినిపించాడట. ఎప్పుటి నుండో ఈయనతో సినిమా తీయాలని చూస్తున్న దేవాకట్టా గతంలో ఎన్ని కథలు చెప్పినా గోపీ మెచ్చలేదట. చివరికి ఓ కథను ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles