Pawan attarintiki daredi movie audio release date confirmed

Trivikram Srinivas, pawan kalyan attarintiki daredi, Pawan Kalyan, Attarintiki Daredi, attarintiki daredi movie, attarintiki daredi audio function, attarintiki daredi europe schedule finished

The audio launch of Pawan Kalyan forthcoming entertainer Attarintiki Daredi is expected to be held in July 14..

పవన్ అత్తారింటికి దారేది ఆడియో ఖరారు

Posted: 07/02/2013 07:54 PM IST
Pawan attarintiki daredi movie audio release date confirmed

మెగా అభిమానులకు మరో పండగ రాబోతుంది. నిన్ననే అబ్బాయి చరణ్ ఆడియో జోష్ లో నుండి తేరుకోక ముందే పవర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం (అత్తారింటికి దారేది) చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 14 నిర్వహించాలని నిర్మాత, చిత్ర యూనిట్ అనుకుంటున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్ర యూనిట్ యూరప్ నుండి వచ్చిన తరువాత ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఉంటుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఆడియోకు విడుదలకు సంబంధించిన ఏర్పాట్లలో నిర్మాత మునిగినట్లు సమాచారం. ఇక యూరప్ లో షెడ్యూలు కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం తరువాత హైదరాబాద్ లో మిగతా షూటింగును కంప్లీట్ చేసేలా దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు.

అయితే పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.....పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. పవన్ గత సినిమా ‘గబ్బర్ సింగ్' ఆడియో ఎలాంటి ఫంక్షన్ లేకుండా డైరెక్టుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో కూడా అదే విధంగా డైరెక్టుగా మార్కెట్లోకి విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే పవన్ అభిమానులకు మరో సారి నిరాశ తప్పదు. మరి పవన్ అభిమానుల ఆశను నెరవేరుస్తాడో లేక నిరాశ పరుస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles