Bahubali rajamouli eye on imax format

prabhas, bahubali, rajamouli, rana, sudeep, sridevi,

Baahubali team is studying the feasibility of shooting the film in IMAX format. If this indeed materializes, this will be the first ever Telugu film to be shot in IMAX.

రాజమౌళి కన్ను ఆ ఫార్మాట్ పై

Posted: 06/22/2013 08:37 PM IST
Bahubali rajamouli eye on imax format

దర్శకధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ సినిమాగా తెరకెక్కించబోతున్న ‘బహుబలి ’ సినిమాకు అనేక హంగులు అద్దుతున్నాడు. ఇప్పటికే ఇన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. దీని పై సాధ్యాసాధ్యాలను పరిశీలించుతున్నాడట. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్ లో తీస్తే ఇంకా బాగా వస్తుందనే ఉద్దేశ్యంతో దీని పై ఆలోచన చేస్తున్నాడట. ప్రస్తుతం ‘ఈగ ’ షాంఘై ఫెస్టివెల్ లో ఎగురుతుంటే ఎంజాయ్ చేయడానికి వెళ్లిన రాజమౌళి అక్కడి నిపుణులతో ఈ చిత్రం ఐమ్యాక్స్ ఫార్మాట్ లో తీయడానికి చర్చలు జరుపుతున్నాడట. MAX ఫార్మాట్లో చిత్రీకరిస్తే.......మామూలు 70 ఎంఎం స్క్రీన్ కంటే 3 రెట్లు పెద్దదైన తెరపై సినిమాను కళ్లకు కట్టినట్లు చూసే అవకాశం ఉంటుంది. విదేశాల్లో వీటికున్న క్రేజ్ ని బట్టి దీన్ని కూడా అదే ఫార్మాట్ లో తీస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని భావిస్తున్నాడట. ఇలాంటి స్ర్కీన్లు పెద్ద నగరాల్లో మాత్రమే ఉన్నాయి. మన హైదరాబాద్ లో ఐమ్యాక్స్ లో మాత్రమే ఉంది. అయితే దీన్ని విదేశాలలో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకున్న ఈయన దాని పై ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. ఇదే గనుక జరిగితే... ఈ ఫార్మాట్ లో వచ్చిన తొలి సినిమా అవుతుంది. రాజమౌళి ఏమైనా చేస్తాడు. ఇక ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్టు వర్కులో బిజీగా ఉంది. రాజమౌళి షాంఘై నుండి వచ్చిన తరువాత షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles