Balayya chasings in dubai deserts

Balakrishna - Boyapati movie, Balakrishna - Boyapati movie shooting in dubai, Balakrishna - Boyapati, Balayya chasings in Dubai deserts

Balakrishna - Boyapati movie shooting formally started on June 10th, Now unit will move to Dubai for New schedule.

బాలయ్య దుబాయ్ ఎడారుల్లో

Posted: 06/15/2013 08:06 PM IST
Balayya chasings in dubai deserts

టాలీవుడ్ లో నందమూరి నటసింహంగా పేరు తెచ్చుకున్న బాలయ్య పరిస్థితి ప్రస్తుతం ఏం బాగోలేదు. వంద సినిమాల్లో నటించి ఆ తరువాత రిటైర్ మెంట్ ప్రకటించాలనే ఉద్దేశ్యంలో ఉన్న బాలయ్య ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. అంతకు ముందు తనకు బ్రేక్ ని ఇచ్చిన బొయపాటి శీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. నేటి నుండి దుబాయ్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.... బాలయ్య సినిమాలో హీరోయిన్ మాత్రం కన్ ఫర్మ్ కాలేదు. ఈయన సరసన నటించడానికి సీనియర్ హీరోయిన్లు, కుర్ర హీరోయిన్లు ఎవరూ ముందుకు రావడం లేదు. మొన్నటికి మొన్న మిస్ ఇండియా ఎరికా ఫెర్నాండేజ్ ఎంపికైందనే వార్తలు వచ్చాయి. కానీ ఆమె నేను బాలయ్య సినిమాలో నటించడం లేదని తేల్చి చెప్పింది. దీంతో బాలయ్య సినిమాకు హీరోయిన్ లేకుండా పోయింది. ఇప్పటి కూడా హీరోయిన్ ఎంపిక కాలేదు. దీంతో చేసేది ఏమీ లేక దుబాయ్ లో బాలయ్య పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడానికి బయలుదేరి వెళ్లారు. ఇక్కడి ఎడారుల్లో బాలయ్య, ఇతర నటులపై కొన్ని ఛేజింగ్ సీన్లను బోయపాటి తెరకెక్కించనున్నారు. ఈనెల 28 వరకు అక్కడే షూటింగు జరగనుంది. మరి తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ ని ఎంపిక చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles