Akkineni akhil to debut with manam

akhil and amala to act in manam, manam casting, akkineni family manam casting,akkineni manam casting,manam movie, Akkineni Akhil

akhil and amala to act in manam, manam casting, akkineni family manam casting,akkineni manam casting,manam movie, Akkineni Akhil

‘మనం ’ లో అక్కినేని అఖిల్

Posted: 06/06/2013 11:15 AM IST
Akkineni akhil to debut with manam

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్ వెండితెర అరంగ్రేటం చేయబోతున్నాడనే వార్తలు గత కొంత కాలం నుండి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఇవి మరీ ఎక్కువయ్యాయి. ఈ ఎంట్రీ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తో ఉంటుందని, ఆయన కుటుంబ బ్యానర్ లో ఈయనను పరిచయం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై ఇరు వర్గాల వారు ఖండించలేదు కూడా. అయితే ఆ సినిమా కన్నా ముందే అఖిల్ వెండితెర పై కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించబోయే ఈ భారీ సినిమాలో అఖిల్ కూడా ఓ పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ మొదటి సినిమాకు వేదిక ఇదే సరైందని భావించిన ఆ కుటుంబం దర్శకుడికి ప్రత్యేకంగా ఓ పాత్రను క్రియేట్ చేయమని కోరారని సమాచారం. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. శ్రియ, సమంత కథానాయికలు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉన్న దర్శకుడు  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నాడట. ఏది ఏమైనా అఖిల్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఈ సినిమా పై మరిన్ని ఆశలు పెంచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles