Raghava lawrence to direct don 2 with nagarjuna

Raghava Lawrence to direct Don 2 with Nagarjuna?, Raghava Lawrence to direct Don 2 with Nagarjuna, Lawrence to direct Don 2 with Nagarjuna, Nagarjuna Lawrence new movie, Lawrence Nagarjuna Don 2

Raghava Lawrence to direct Don 2 with Nagarjuna?, Raghava Lawrence to direct Don 2 with Nagarjuna, Lawrence to direct Don 2 with Nagarjuna, Nagarjuna Lawrence new movie, Lawrence Nagarjuna Don 2

నాగ్ డాన్ - 2

Posted: 05/22/2013 07:14 PM IST
Raghava lawrence to direct don 2 with nagarjuna

హీరో నాగార్జునకు మాస్ ఇమేజ్ ని  తెచ్చిపెట్టిన రాఘవ లారెన్స్ మరో సారి నాగార్జునతో సినిమా చేయనున్నాడనే వార్తలు ఫిలింనగర్ వర్గాల నుండి వినిపిస్తున్నాయి. గతంలో ఈయన ‘మాస్, డాన్ ’ సినిమాలు తీసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు డాన్ సినిమాకే స్వీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాకు ‘డాన్ - 2 ’ అనే పేరును కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఈయన తీసిన డాన్ సినిమా సక్సెస్ ని సాధించలేదు. అయితే ఇప్పుడు దానికే సీక్వెల్ అనే సరికి నాగార్జున కొంత సంశయిస్తున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించిన స్టోరీని విన్న తరువాతనే ఓ నిర్ణయానికి రానున్నాడట. కాంచన సినిమాతో ఒక్కసారి రైజ్ అయిన లారెన్స్ ‘రెబల్ ’ సినిమాతో మళ్లీ పడిపోయాడు. దీంతో తెలుగులో ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. దాంతో ‘కాంచన సీక్వెల్ ’ ని మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమా తరువాత ‘డాన్ - 2 ’ తీయాలనుకుంటున్నాడట. మరి నాగ్ ని ఇంప్రెస్ చేసే స్టోరీని లారెన్స్ వినిపించి ఒప్పిస్తేనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది.  ఇక నాగార్జున ప్రస్తుతం ‘భాయ్'షూటింగ్ లో బిజిగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles