Pawan trivikram movie nizam rights gets solded for 11 5 crores

"Pawan Trivikram Movie Nizam Rights, pawan kalyan, brahmanandam, samantha, trivikram, praneetha,

Pawan Kalyan’s upcoming film in Trivikram Srinivas’ direction has reportedly set a new record. The film’s Nizam stribution rights have been bought by Global Cinemas for an undisclosed amount. In fact, it was Nithin who convinced the team at Global Cinemas to buy the rights

పవన్ రికార్డుల మోత మొదలైంది

Posted: 04/24/2013 12:10 PM IST
Pawan trivikram movie nizam rights gets solded for 11 5 crores

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే రికార్డుల మోత మొదలవుతుంది. ఏరియా డిస్టిబ్యూటర్లు అయితే.... ఎంతైనా పెట్టి కొనడానికి వెనకాడరు. తాజాగా త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా నైజాం హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్లు సినిమా వర్గాల సమాచారం. ఈ సినిమా నైజాం రైట్స్ ని గ్లోబల్ సినిమాస్ వారు ఎవరూ ఊహించని రేటు పెట్టి కొన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ ఇంత వరకు ఏ సినిమా అమ్మడుపోనంతగా 6.70 కోట్లు పలికినట్లు టాలీవుడ్ లో ప్రచారం సాగుతుంది.  ఇక్కడ విశేషం ఏంటంటే.... ఈ సినిమా నైజాం రైట్స్ కొన్నది ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా అతని పేరు చెప్పుకొని భారీ హిట్ కొట్టిన హీరో నితిన్ వాళ్లకి సంబంధించినదే గ్లోబల్ మూవీస్. దీనిని కొనమని సలహా ఇచ్చింది కూడా నితినే. దీని గురించి ట్వీట్ చేస్తూ పవన్ సినిమాను భారీ రేటుకు కొన్నది మేమే అని చెప్పాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈచిత్రంలో పవర్ స్టార్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడనే వార్త తెలిసిందే. ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు టైటిల్ మాత్రం కన్ ఫర్మ్ కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles