Katju plea for sanjay dutt mercy finds support from govt

sunil dutt,Shatrughan Sinha,Sanjay Dutt,samajwadi party,Ram Gopal Yadav,Mulayam Singh Yadav,jaya bachchan,Bollywood

MPs extended support to actor Sanjay Dutt, who was given a five-year jail term by the Supreme Court in an arms possession case

Katju plea for Sanjay Dutt mercy finds support from govt.png

Posted: 03/23/2013 12:40 PM IST
Katju plea for sanjay dutt mercy finds support from govt

bollywood stars

1993 పేళుళ్ళకు సంబంధించి ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణల కింద సుప్రీం కోర్టు తుది తీర్పులో సంజయ్ దత్ కి ఐదేళ్ళ జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే సంజయ్ దత్ కి శిక్ష పడటం పై పలువురు బాలీవుడ్ నటులు సానుభూతి వ్యక్యం చేయడమే కాకుండా ఇంటికి వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. ఇక  ప్రెస్‌ కౌన్సిల్‌ చీఫ్‌ మార్కండేయ కట్టూ ఏకంగా అతనికి క్షమాబిక్ష పెట్టండి అని మహారాష్ట్ర గవర్నర్ కి లేఖ రాయడమే కాకుండా, ఆర్టికల్‌ 161 ప్రకారం గవర్నర్‌కు క్షమాభిక్ష పెట్టే అధికారం ఉందన్నారు. అయితే ఈయన లేఖ పై స్పందించిన ప్రభుత్వం విజ్ఞప్తి విషయమై పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఇక కట్టూ లేఖ పై కేంద్ర మంత్రి మనీష్ తివారి మాట్లాడుతూ... కట్టూ చేసిన వ్యాఖ్యలు అర్థవంతమైనవే అని అన్నారు. న్యాయశాఖ మంత్రి క్షమాబిక్ష అంశం గవర్నర్ చూసుకుంటాడని, ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. ఇదిలా ఉంటే శివసేన, బిజేపీ వారు మాత్రం కట్టూ లేఖ ఇవ్వడం పై అనుకూలంగా స్పందించలేదు. కోర్డు నిర్ణయానికి  సంజయ్ కట్టుబడి ఉంటానని అన్నాడని, కోర్టు తీర్పుకు సంజయ్‌దత్‌ బద్ధుడై ఉండాలని అన్నారు. ఇక ప్రముఖ సినీ నటి, సమాజ్‌వాది పార్లమెంట్‌ సభ్యురాలు అయిన జయాబచ్చన్ సంజయ్ కి క్షమాబిక్ష ప్రసాదించాలని మహారాష్ట్ర గవర్నర్ ని కలిసి కోరుతానని అన్నారు. ఇక సంజయ్ ని కలిసిన వారిలో సైప్ ఆలీఖాన్, రణబీర్ కపూర్, విద్యాబాలన్ తదితరులు ఉన్నారు. మరి వీరందరి డిమాండ్ మేరకు   గవర్నర్ క్షమాబిక్ష ప్రసాదిస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas as che guevara getup
Aamir khan steps into a woman shoes again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles