Rajani kantpng

rajani-kant.png

Posted: 03/03/2013 01:06 PM IST
Rajani kantpng

రజనీ కాంత్ కూతురు సౌందర్య దర్శకత్వంలో రజనీ కాంత్ హీరోగా తమిళంలో కొచ్చాడయాన్, తెలుగులో విక్రమసింహ గా వస్తున్న చిత్రంకోసం రజనీ కాంత్, దీపికల మీద లండన్ లో పోరాట దృశ్యాలను చిత్రీకరించటంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లే.  ఎంతో కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ జానపద చిత్రంలో దీపికా యువరాణిగా తళుక్కుమనబోతోంది. 

మామూలు కదలికల్లో కాకుండా పోరాటాలు, ప్రమాదంలో పడి తప్పించుకోవటాలు ఇలాంటి దృశ్యాలలో హీరోయిన్లను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఉత్సాహం చూపిస్తారనే ఉద్దేశ్యంతో చిత్ర నిర్మాణంలో అటువంటి సన్నివేశాలలో ఎక్కువ శ్రద్ధ చూపించటం జరుగుతుంది.  ఇద్దరు మహిళల పోరాటాలు, గుర్రపు స్వారీలు, నదిలో పడిపోవటాలు ఇలాంటివి చిత్రంలో ఉంటే ప్రేక్షకులను బాగా అలరిస్తుందని నిర్మాత, దర్శకులు బాగా నమ్ముతారు. 

rajanikant-deepikaఎంతో కాలంగా నిర్మాణ దశలో ఉన్న విక్రమసింహ నిర్మాణం పూర్తవటంతో రజనీ కాంత్ అభిమానుల ఉత్సాహానికి హద్దులు లేవు.  ఈ మధ్య మరో తమిళ దిగ్గజం కమల్ హాసన్ సినిమా దశావతారం దెబ్బతినటంతో అందరి దృష్టీ ఇప్పడు ఈ విక్రమ సింహా మీదనే ఉన్నాయి.  అందులో హిందీలో మెరుపు తీగెలా మెరుస్తున్న కన్నడ భామ దీపికా హొయలను చూడటానికి కుర్రకారంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది.

ఎఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలోని ఒక పాటలో రజనీకాంత్ కూడా తన గళాన్ని కలపటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka married to hyderabad businessman
Kamasutra 2 will come in 4d with hollywood actress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles