Movie starts with anuskha as rudramadevi

anuskha shetty, rudramadevi movie, gunasekhar, anuskha as rudramadevi

anuskha as rudramadevi in gunasekhar movie.

rudramadevi.jpg

Posted: 02/15/2013 04:06 PM IST
Movie starts with anuskha as rudramadevi

    

anuskha-inner     తెలుగు సినిమా పరదా మీద వీరరస ప్రదర్శన చెయ్యబోతున్న అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న రుద్రమదేవి సినిమా వరంగల్ వేయి స్థంబాల గుడిలో ముహూర్తం షాట్ ని లాంఛనప్రాయంగా ప్రారంభించారు.  ప్రత్యేక పూజలను నిర్వహించిన చిత్రబృందం కాకతీయ వైభవ చిహ్నంగా మిగిలివున్న చారత్రాత్మక కట్టడాలలో ఒకటైన ఓరుగల్లు నుంచి ఈ సినిమా నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషాన్ని తెలియజేసారు. 


     తానే స్వయంగా దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన  గుణశేఖర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని, కాకతీయ సామ్రాజ్యవైభవం వన్నె తగ్గకుండా, ఇళయరాజా, తోట తరణి, శ్రీకర ప్రసాద్, అజయ్ విన్సెంట్ లాంటి సాంకేతిక దిగ్గజాల సహకారంతో మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డి సినిమాగా రూపొందిస్తామని అన్నారు.  పది సంవత్సరాల నుంచీ ఈ సినిమాను నిర్మించాలని కలలు గంటున్న గుణశేఖర్ ఏప్రిల్ నెల నుంచీ ఏకబిగిని చిత్రీకరణ కార్యక్రమాన్ని చేపడతామని మీడియాకు తెలియజేసారు. 


     ఈ సందర్భంలో మాట్లాడిన సినిమా టైటిల్ పాత్రను పోషిస్తున్న హుందా నటి అనుష్క, అదే సినిమాలో వీరభద్రుని పాత్రని పోషిస్తున్న రానా వారి వారి పాత్రల పట్ల హర్షాన్ని వ్యక్తపరుస్తూ తమ శక్తి వంచన లేకుండా ఆ పాత్రలకు న్యాయం చేస్తామని అన్నారు. 

తెలుగు సినిమా పరదా మీద వీరరస ప్రదర్శన చెయ్యబోతున్న అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న రుద్రమదేవి సినిమా వరంగల్ వేయి స్థంబాల గుడిలో ముహూర్తం షాట్ ని లాంఛనప్రాయంగా ప్రారంభించారు.  ప్రత్యేక పూజలను నిర్వహించిన చిత్రబృందం కాకతీయ వైభవ చిహ్నంగా మిగిలివున్న చారత్రాత్మక కట్టడాలలో ఒకటైన ఓరుగల్లు నుంచి ఈ సినిమా నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషాన్ని తెలియజేసారు. 

తానే స్వయంగా దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన  గుణశేఖర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని, కాకతీయ సామ్రాజ్యవైభవం వన్నె తగ్గకుండా, ఇళయరాజా, తోట తరణి, శ్రీకర ప్రసాద్, అజయ్ విన్సెంట్ లాంటి సాంకేతిక దిగ్గజాల సహకారంతో మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డి సినిమాగా రూపొందిస్తామని అన్నారు.  పది సంవత్సరాల నుంచీ ఈ సినిమాను నిర్మించాలని కలలు గంటున్న గుణశేఖర్ ఏప్రిల్ నెల నుంచీ ఏకబిగిని చిత్రీకరణ కార్యక్రమాన్ని చేపడతామని మీడియాకు తెలియజేసారు. 

ఈ సందర్భంలో మాట్లాడిన సినిమా టైటిల్ పాత్రను పోషిస్తున్న హుందా నటి అనుష్క, అదే సినిమాలో వీరభద్రుని పాత్రని పోషిస్తున్న రానా వారి వారి పాత్రల పట్ల హర్షాన్ని వ్యక్తపరుస్తూ తమ శక్తి వంచన లేకుండా ఆ పాత్రలకు న్యాయం చేస్తామని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Romance movie teaser released
Andala rakshasi hero rahul in suresh productions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles