Director vamsi to start his 25th film

Director Vamsi to start his 25th film, five heroines in movie, single hero

Director Vamsi to start his 25th film

Director Vamsi to start his 25th film.png

Posted: 01/01/2013 05:12 PM IST
Director vamsi to start his 25th film

Vamshi

టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు వంశీ. ఇతని సినిమాలు సరదాగా సాగిపోతుంటాయి. థియేటర్ లోకి వెళ్ళి సినిమా చూస్తుంటే... ఏ గోదావరి ఒడ్డుకు వెళ్లి కూర్చున్నట్లు హాయిగా ఉంటుంది. అటువంటి దర్శకుడు గతంలో 'సితార' ... 'ఏప్రిల్ ఒకటి విడుదల, ‘'లేడీస్ టైలర్ ’ ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించాడు. నిండైన తెలుగుదనంతో ... వినోద ప్రధానమైన కథలతో మూడు దశాబ్దాలుగా అశేష ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న వంశీ, తాజాగా మరో చిత్రాన్ని రూపొందించడానికి నడుం బిగించాడు. ఇప్పుడు తన తాజా చిత్రంలో ఐదుగురు కథానాయికల్ని ఎన్నుకోవడం విశేషం. ఈ చిత్రం గురించి నిర్మాత పూర్ణనాయుడు మాట్లాడుతూ... ఒక హీరో, ఐదుగురు కథానాయికల మధ్య సాగే సరదా సన్నివేశాలే ఈ సినిమా అని ఆయన వివరించాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రీని తీసుకున్నట్లు సమాచారం. ఈనెల చివరి వారంలో నుండే  ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Svsc movie release postpone
Anushka will play double role  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles