Ramgopal varma movie the attacks of 2611

RGV movie on the attacks of 26/11,ramgopal varma, ramgopal varma movie, the attacks of 26/11, ramu movie the attacks of 26/11, the attacks of 26/11 teaser, 26/11 movie wallpapers,

ramgopal varma movie the attacks of 26/11

15.gif

Posted: 11/27/2012 07:08 PM IST
Ramgopal varma movie the attacks of 2611

ram-gopal-varmaee

        ‘మానవ చరిత్రలో న్యూయార్క్‌ లో 9/11న జరిగిన తీవ్రవాదుల దాడులకంటే భయంకరమైనవి ఎప్పుడూ జరగలేదు. కాని కేవలం అవి జరిగిన తీరులో 26/11 దాడులు అంతకంటే భయం కరమైనవి, ఆశ్చర్యకరమైనవి. మనలో చాలా మందికి ఆ రోజు రాత్రి దాడులు అయిన సంగతి తెలుసు కాని చాలా కొందరికే ఆ దాడుల వెనుక జరిగిన సంఘటనల గురించిగాని, వాటిలో చిక్కుకున్న వ్యక్తుల ఉద్వేగాల గురించిగాని తెలుసు. ఈ తెలియని నిజాలే అందరికి తెలియాలని, తెలుపాలని మేము భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం నిర్మించాలని నిర్ణయించుకున్నాం. కేవలం ఒక్క చిత్రంతో జరిగిన విషాదాలకి, సాహసాలకి న్యాయం చేయడం అన్నది అసంభవం. ఆ దాడుల వివిధ అంశాలపై రాబోయే సంవత్సరాలలో నేనుగానీ, ఇంకెవరైనా గానీ ఎన్ని సినిమాలు తీసినా జరిగిన సంఘటనల తీవ్రత యొక్క ఉపరితలు మాత్రమే గీరే ప్రయత్నం చేయగలం.

నా సామర్థ్యం మేరకు ఈచిత్రంలో 26/11 దాడుల వెనుక అసలు కథ, వాటిలో పాలుపంచుకున్న వ్యక్తుల భావోద్వేగ అంశాలు, వారి భావాలను తెరకెక్కించాలన్నదే నా ప్రయత్నం. 26/11న జరిగిన దాడులు ఒక మతం లేక ఒక సముదాయంపై దాడులు కావు. అవి మానవత్వం పై జరిగిన దాడులు. చనిపోయిన వారు హిందూ లేదా ముస్లిం అన్న తేడా లేకపోవడమే దీనికి నిదర్శనం.26/11 కేవలం ఒక చిత్రం కాదు. వాస్తవానికి ఒక అద్దం. ఈ దాడులలో పాలు పంచుకున్ని పోలీసులు, ప్రాణాలతో బయటబడ్డ సర్వైవర్స్‌తో మాత్రమే కాదు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలుపంచుకున్న ఇతర చాలా మంది వ్యక్తులతో లోతైన ఇంటర్వ్యూలు నిర్వహించాను. నేను ఆ దాడుల్ని ఎదుర్కున్న వాళ్ళ కళ్ళతో చూసి, వారి నోటిద్వారా విన్న తరువాత, కన్నీళ్ళతో షాక్‌ అయ్యాను. మానవ మనస్సు యొక్క ధైర్యమే కాక క్రూరత్వాన్ని కూడా ఇంత దగ్గరగా చూసిన తరువాత, నాకు నా పట్లగా, మనుషుల పట్లగా కూడా చాలా వినూత్నమైన, ఒక మెరుగైన అవగాహన కలిగిందని నేను భావిస్తున్నాను.’ అన్నారు సుప్రసిద్ధ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Making of aamir khan talaash video
O aunty katha movie ready to release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles