Damarukam full songs nagarjuna

damarukam full songs nagarjuna anushka achhireddy

damarukam full songs nagarjuna

3.png

Posted: 10/13/2012 02:07 PM IST
Damarukam full songs nagarjuna

damarukam_movie_inneree

గతరాత్రి ‘డమరుకం' సినిమా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ పాటల యొక్క ప్రత్యేకతను నాగ్ వెల్లడించారు.  సందర్భానుసారంగా పాటలు వస్తాయనీ. ఆ పాటలు అన్ని వర్గాలవారిని అలరించడం వల్లనే ఆడియో సక్సెస్ అయిందని నాగ్ అన్నారు. రాత్రి  హైదరాబాద్ - ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో మనసుకు ప్రశాంతతను ఇచ్చే శ్లోకం ... భక్తిని మేలుకొలిపే గీతాలు ... రొమాంటిక్ టచ్ ఇచ్చే 'నేస్తమా' ... మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే 'సక్కుబాయి'  పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనీ, అందుకే ఈ ఆడియో ఇంతటి విజయాన్ని సాధించిందని నాగార్జున చెప్పారు.
        ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస రెడ్డి ... చార్మీ ... అచ్చిరెడ్డి ... రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. నాగార్జున - అనుష్క జంటగా తెరకెక్కిన ఈ సినిమా, ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
       ఇదిలాఉండగా,  'డమరుకం' సినిమాను పరిశీలించిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ను ఇచ్చారు. నాగార్జున కెరియర్లోనే తొలిసారిగా 40 కోట్ల ఖర్చుతో రూపొందిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. దైవ శక్తికీ ... దుష్ట శక్తికి మధ్య జరిగే పోరాటమే కథావస్తువుగా తెరకెక్కిన ఈ సినిమాకి, అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దాదాపు ఓ గంటపాటు తెరపై కనిపించే గ్రాఫిక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
     కొద్దిసేపటి క్రితం ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసిన ఈ సినిమా పుల్ సాంగ్స్ జ్యూక్ బాక్స్ మీకోసం.. చూసి ఎంజాయ్ చేయండి...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cameramen gangato rambabu dailogues
Arjun daughter cine entry as heroine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles