Nayana tara takes new steps

nayana tara takes new steps

nayana tara takes new steps

15.gif

Posted: 06/19/2012 03:29 PM IST
Nayana tara takes new steps

     అందాల భామ నయనతార ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కొత్త వాటిమీద ఆశ పడుతోంది.  పాత ఇమేజ్ ని తానిప్పుడు కోరుకోవడం లేదు. ఇంతకు ముందు తనకు లభించిన సెక్సీ ఇమేజ్ మీద ఆమెకు మొహం మొత్తేసింది.2e ఇకపై అలాంటి సెక్సీ పాత్రలు చేయనంటోంది. కొత్తగా కనపడాలని ఆశపడుతోంది. అందుకే ఇటీవల రెండు కోట్లు ఆఫర్ చేసినా, సెక్సీ పాత్రను చేయడానికి ఒప్పుకోలేదని చెబుతోంది.  "డర్టీ పిక్చర్ రీమేక్ లో నటిస్తే రెండు కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ, మొన్నే సీతగా చేసిన దానిని ఇప్పుడు సిల్క్ స్మితగా నటిస్తే ప్రేక్షకులు ఎలా భావిస్తారు? ఆ పాత్ర ద్వారా సంపాదించుకున్న పేరు కాస్తా 'హుష్ కాకి' అయిపోతుంది. అందుకే ఆ సెక్సీ ఇమేజ్ కి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను" అంటోంది నయన్. ఇకపై హుందాగా వుండే పాత్రలే చేస్తానని తెగేసి చెప్పింది. తనలో ఇలాంటి మార్పు రావడానికి 'శ్రీరామ రాజ్యం' సినిమా కొంతవరకు కారణమైందని నయన్ చెబుతోంది. ఇదేంటి కొత్త వేదాంతం వల్లిస్తోంది నయన్.. అంటూ ఆశ్చర్యపోవటం కొందరివంతవుతోంది. ఈ అందగత్తె ఎంతవరకూ ఆమాటలకు కట్టుబడుతుందో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi rai new strategy
Happy birthday to kajal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles