Hyderabad regional sensor officer transfer

hyderabad regional sensor officer transfer..?

hyderabad regional sensor officer transfer..?

15.gif

Posted: 06/05/2012 03:31 PM IST
Hyderabad regional sensor officer transfer

       హైదరాబాదు ప్రాంతీయ సెన్సార్ అధికారి ధనలక్ష్మి బదిలీకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం టాలీవుడ్ కి చెందిన పలువురు నిర్మాతలు రాష్ట్ర ఎంపీల ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజాయతీగా, ముక్కుసూటిగా వ్యవహరించే ధనలక్ష్మి సెన్సార్ ఆఫీసర్ గా వచ్చాక తెలుగు నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయనే చెప్పాలి.6 ఇంతకు ముందు ఆఫీసర్ గా పని చేసిన అధికారి అవినీతిపై టాలీవుడ్ లో రకరకాల కథలు చెప్పుకునేవారు. చిన్న సినిమాకి ఇంత... పెద్ద సినిమాకు ఇంత... అంటూ సెన్సార్ రేట్లు ఉండేవని అనేవారు. ఆ అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం వల్లే ఆయనను బదిలీ చేసి, ఆ స్థానంలో ధనలక్ష్మిని నియమించారని అంటారు. ఈమె వచ్చినప్పటి నుంచీ ద్వంద్వార్ధపు సంభాషణలను, సెక్స్ దృశ్యాలను నిర్మొహమాటంగా కట్ చేయించారు. దాంతో నిర్మాతలకు ఆమె కంటగింపుగా మారారని చెప్పుకుంటున్నారు. ఆమె లంచాలకు లొంగే మనిషి కాకపోవడంతో, ఆమెను బదిలీ చేయించడం కోసం రాజకీయంగా పైరవీలు మొదలయ్యాయని అంటున్నారు.
      ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ మంత్రి అంబికా సోనీ ఆదేశంపై సెన్సార్ బోర్డు సిఈఓ పంకజ్ ఠాకూర్ తాజాగా హైదరాబాదు వచ్చి, తెలుగు నిర్మాతల ఫిర్యాదులు స్వీకరించి, వారితో చర్చించి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా సెన్సార్ 6eఆఫీసర్ పై ఆగ్రహంగా వున్న పలువురు నిర్మాతలు ఆయనకు తమ గోడు వెళ్లదీసుకున్నారనీ, ఆమెను ఇక్కడ కొనసాగిస్తే తెలుగు సినిమా బతికి బట్టకట్టదనీ తేల్చిచెప్పారట. ఆమె వల్ల తాము ఎలా నష్టపోయిందీ వివరించారట. ధనలక్ష్మికి తెలుగు రాదనీ, అందువల్ల సినిమాలను, వాటిలోని సంభాషణలనూ ఆమె సరిగ్గా అర్ధం చేసుకోకుండానే కట్స్ చెబుతున్నారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
       అయితే, అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ వుండడం వల్లే కొంత వరకైనా మన సినిమాల్లో 'బూతు'కు కళ్ళెం పడుతోందని వాదించే వాళ్లూ టాలీవుడ్ లో వున్నారు. ప్రస్తుతం సెలవులో వున్న ధనలక్ష్మి తిరిగి డ్యూటీలో చేరే సమయానికి బదిలీ ఉత్తర్వులు ఆమెకు అందడం ఖాయమని టాలీవుడ్ కు చెందిన కొన్ని పెద్ద తలకాయలు జోస్యం చెబుతున్నాయి. ఈ బదిలీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naga chaitanya forth coming movie autonagar surya
Young hero karti new movie biryani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles