నిజమే.. వై.ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనను బెదిరించడం వాస్తవమేనని సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ప్రకటించాడు. 'రక్త చరిత్ర - 2' సినిమా సమయంలో వర్మని జగన్ బెదిరించాడంటూ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఈ ఉదయం సంచలన ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో తనకు సంబంధించిన సన్నివేశాలు ఉంటే సహించనంటూ వర్మని ఆయన హెచ్చరించాడనీ ... తనతో ఈ విషయాన్ని వర్మ స్వయంగా చెప్పాడని రాజగోపాల్ అన్నారు.
వెంటనే, ఈ వివాదంపై వర్మ స్పందిస్తూ, లగడపాటి వ్యాఖ్యలు నిజమేనంటూ మీడియాకి సమాచారమిచ్చారు. 'రక్త చరిత్ర' 2 సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలంటూ జగన్ కి అత్యంత సన్నిహితుడైన ఓ అనుచరుడు తనపై తీవ్రమైన ఒత్తిడి చేశాడనీ ... ఆ కారణంగానే ఆ సినిమాలోని చాలా సన్నివేశాలను తొలగించవలసి వచ్చిందని వర్మ చెప్పారు. తనను పోలిన ఏ పాత్రా సినిమాలో ఉండటానికి వీలు లేదని జగన్ అతని సన్నిహితుని ద్వారా బెదిరించారని వర్మ స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం అటు రాజకీయ ఇటు సినీ రంగంమీదా పెను ప్రకంపనలు రేకెత్తించే అవకాశం కనిపిస్తోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more