Brahmanandam in daruvu

brahmanandam in daruvu

brahmanandam in daruvu

28.gif

Posted: 05/17/2012 07:36 PM IST
Brahmanandam in daruvu

       బ్రహ్మానందానికి ఓ కొత్త చిక్కొచ్చిపడింది. అంటే వ్యక్తిగతంగా కాదు.. ఆయన చేస్తున్న పాత్రకి.  'దరువు' చిత్రంలో విద్యాబాలన్ పాత్రని బ్రహ్మానందం పోషిస్తోన్నసంగతి తెలిసిందే.braheeee అయితే ఇప్పుడీ పాత్ర వివాదాలకి దారితీసేలా కనిపిస్తోందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం 'విద్యా బాలన్' అనే డాన్స్ మాస్టర్ గా నటిస్తున్నాడు. అయితే ఈ పాత్ర వేష ధారణ ... అది పలికించే హావభావాలు అచ్చుగుద్దినట్టుగా ఓ ప్రముఖ డాన్స్ మాస్టర్ (శివశంకర్) ని పోలివుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ పాత్ర తీరుతెన్నుల గురించి తెలుసుకున్న కొందరు పెద్దలు ఇప్పుడీ విధానంపై సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఇటీవల నంది బహుమతిని అందుకున్న ఆ డాన్స్ మాస్టర్ ని, కామెడీ పేరుతో అవమానించడం భావ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. గౌరవనీయమైన వ్యక్తులని కించపరచడమే హాస్యమైతే, అంతకి మించిన దిగజారుడుతనం మరొకటి లేదంటూ వాళ్లు తమ అభిప్రాయాన్ని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీన్ని లైట్ తీసుకుంటారో సీరియస్ చేస్తారో మరి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh bollywood records
Actress sneha and prasanna marriage gift  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles