The father of indian cinima birth day today

the father of indian cinima birth day today

the father of indian cinima birth day today

15.gif

Posted: 04/30/2012 04:27 PM IST
The father of indian cinima birth day today

      దాదా సాహెబ్ ఫాల్కే..  అసలుపేరు ధండీరాజ్ గోవింద్ ఫాల్కే.  ఏప్రిల్ 30, 1870న మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ లో జన్మించారు. భారతీయ సినిమా పితామహుడుగా ఫాల్కే పేరు తెచ్చుకున్నారు. రాజా హరిశ్చంద్ర సినిమాతో దాదా సాహెబ్ ఫాల్కే చరిత్ర సృష్టించారు. నిర్మాతగా, దర్శకుడిగా స్థిరపడ్డాడు. భారతీయ సినిమాలకు ఆద్యుడుగానూ నిలిచారు.dada_inn దాదాసాహెబ్ ఫాల్కే  95ఫీచర్ ఫిల్మ్స్, అనేక షార్ట్ ఫిల్మ్ లు నిర్మించారు. ఎన్నో హిట్ సినిమాలు అందించారు. అవార్డులెన్నో గెలుచుకున్నారు.
      ఈ మహనీయుని పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దాదా సాహేబ్ ఫాల్కే అవార్డును అందిస్తుంది. ఈ అవార్డు తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, ప్రముఖ నిర్మాత రామానాయుడులకు దక్కింది.
      కాగా, రాజా హరిశ్చంద్ర.. 1913 సంవత్సరంలో విడుదలైన హిందీ మూకీ సినిమా. దీనికి దర్శకత్వం వహించింది దాదాసాహెబ్ ఫాల్కే. రామాయణ, మహాభారతాల్లో ప్రస్తావించిన రాజు హరిశ్చంద్రుడి కథతో ఈ మూకీ చిత్రాన్ని తెరకెక్కించారు ఫాల్కే. రాజా రవివర్మ గీసిన చిత్రాలతో ప్రభావితుడైన ఫాల్కే ఈ సినిమాకు ఆయన బొమ్మల్లో చూపించినట్లుగానే పాత్రల ఆహార్యాన్ని చూపించారు. ఫాల్కే నిర్మించిన చివరి సినిమా గంగావతరన్. దాదా సాహెబ్ ఫిబ్రవరి 16, 1944లో పరలోకాలకు పయనమయ్యారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhuri deekshit acts as gang leader
Ramcharan eega  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles