Dammu audio relese in a happy movement

dammu audio relese, in a happy movement

dammu audio relese in a happy movement

2.gif

Posted: 03/30/2012 03:01 PM IST
Dammu audio relese in a happy movement

            22యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ ఆడియో వేడుక సరదా సరదాగా సాగింది. ఓ వైపు దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాలోని డైలాగులు చెబుతుంటే తోటి దర్శకులకు సైతం నవ్వు ఆపుకోలేకపోయారు. శ్రీను వైట్ల అయితే మరీ విరగబడి నవ్వుకున్నాడు. దీనికి తోడు ఎన్టీఆర్ తో పాటు మిగతా వక్తలంతా మాటలతో నవ్వుల పూలు పూయించారు. 
           ఇక ఎన్టీఆర్ అయితే ఇలా మాటల తూటాలు పేల్చారు. ‘నా గుండెల్లో నిలిచి ఉన్న మన దైవం ఎన్టీఆర్‌కి పాదాభివందనం చేస్తున్నాను. అభిమానుల రుణం వంద జన్మలెత్తినా తీర్చుకోలేను. వారిని, నా కన్న తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ఎన్టీఆర్ ఉద్వేగంగా అన్నారు. 55
            బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్, త్రిష, కార్తీక నాయకా నాయికలుగా కేయస్ రామారావు సమర్పణలో అలెగ్జాండర్ వల్లభ నిర్మించిన ‘దమ్ము’ చిత్రం ఆడియో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై విధంగా స్పందించారు.
రాజమౌళి : తారక్‌తో సినిమా చేసేటప్పుడు అది తనకెలా ఉపయోగపడుతుందా? అని ఎదురు చూస్తాను. అలా చేసినదే ‘యమదొంగ’ ’’.
శ్రీను వైట్ల : ‘‘ఎన్టీఆర్ ఎనర్జీని వాడుకుంటూ ‘బాద్‌షా’ చేస్తున్నాను. నాకు ఈ ‘దమ్ము’ పెద్ద టార్గెట్ అవ్వాలి. దాన్ని నా ‘బాద్‌షా’ క్రాస్ చెయ్యాలి’’.
            ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు :  ‘‘కొత్త పెళ్లికొడుకు ఎన్టీఆర్‌ని ఈ సినిమా కోసం 30 రోజులు పైగా ఎండలో కష్టపెట్టాం. ఈ సందర్భంగా ఆయన భార్య లక్ష్మీప్రణతికి సారీ చెబుతున్నాను. అలాగే నిర్మాణ సమయంలో ఎవరికైనా కష్టం కలిగించి ఉంటే సారీ’’.77
            కీరవాణి దంపతులు ఆడియో సీడీని ఆవిష్కరించి ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీప్రణతికి ఇచ్చారు. ఈ వేడుకలో ‘దమ్ము’ బ్యూటీస్ త్రిష, కార్తీక తో పాటు.. యూనిట్ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

 

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr wife lakshmi pranathi special attraction in dammu audio
Hero nitin birthday special  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles