స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ధమాకా మొదలైంది. కేవలం మాతృసంస్థ టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ వంటి ఇతర భాషల ప్రేక్షకులకూ అర్జున్ తన వినోదాలు పంచేందుకు రంగం సిద్దమైంది. భారీ బడ్జెట్ మూవీ ‘బద్రీనాద్’ చిత్రం అనంతరం షోల్డర్ గాయం కారణంగా డాక్టర్ల సలహా మేరకు కొంత కాలం షూటింగ్ లకు దూరంగా ఉన్న అల్లు అర్జున్ ఇకపై మరింత వేగంగా చిత్రాలు చేసేందుకు సై అంటున్నాడని విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం. ఇప్పటికే పలు ప్రాజక్టులతో బిజీ గా ఉన్న ఈ యంగ్ హీరో మూవీల గురించి పలు ఆసక్తికర సంగతులు మీకోసం.
సెల్వ రాఘవన్ రూపొందించే ద్విభాషా చిత్రం(తెలుగు, తమిళం) లో అల్లు అర్జున్ నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన శృతి హాసన్ నటించటం ఖాయమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇదే అల్లు అర్జున్ కు తొలి తమిళ చిత్రం కావటం విశేషం. కాగా, అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ కూడా కోలీవుడ్ ద్వారానే వెండితెరకు పరిచయం అవుతున్నారని మీకు ఇంతకు ముందే వివరించాం. అటు మలయాలంలోనూ అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. భవిష్యత్ లో ఒకవేళ మలయాలంలోనూ ఈ యువ హీరోలు తెరంగేట్రం చేసేస్తారేమో చూడాలి.
ఇక తాజాగా, స్టైలిష్ స్టార్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. . అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించిన ఒక ఉత్కంఠ భరితమయిన బ్యాంకు దోపిడీ సన్నివేశం ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అటు, చెన్నై పోర్టులో తెరకెక్కించిన పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో కీలక యాక్షన్ సన్నివేశాలు అబ్బుర పరిచేలా చిత్రీకరించారు.
సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం పాత్రలు కూడా ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. జూన్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.ఈ సినిమా విడుదలకు ముందే హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా పంపిణీ హక్కులను దర్శక రత్న దాసరి నారాయణరావు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘సిరి మీడియా’ కొనుగోలు చేసి ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కులు దాదాపు 23 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. ఇది అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక మొత్తంగా నమోదైన రికార్డు.
మార్కెట్లో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఓ వైపు బన్నీ డాన్స్, తాజాగా కామెడీ టైమింగ్.. మరో వైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పంచ్ డైలాగులతో ప్రేక్షకులకు ఈ మూవీ నవ్వుల పండగేనని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
అర్జున్ మరో ప్రాజక్ట్ గురించి : అల్లు అర్జున్ - సురేందర్ రెడ్డి తొలిసారిగా జతకట్టబోతున్నారు. ఇందులో చాలా ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే స్టైలిష్ స్టార్ గా పేరు ఉన్న అల్లు అర్జున్....ఒకరైతే... స్టైలిష్ టేకింగ్ తో చిత్రాలు చేసే డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి.. వీరిరువురూ కలిసి ఈ చిత్రం చేస్తుండటంతో ఔట్ పుట్ ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరం.
మనకందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాను బుజ్జి నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ ఎప్పటినుంచి మొదలవుతుందనేదానిపై ఏప్రిల్, మే అని వార్తలొస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఏప్రిల్ మధ్యనుంచి చిత్రీకరణ మొదలు కానుంది.
ఇంకో స్పెషల్ అప్పీరెన్స్ ఏమంటే, వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న “ఎవడు” చిత్రం లో అల్లు అర్జున్ ఒక కీలకమైన పాత్ర కూడా చేస్తున్నసంగతి తెలిసిందే.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more