Pundari kakshayya

telugu actor, and producer ,pundari, kakshayya ,is no more.., he dead, in chennai, today

pundari kakshayya is no more.. he dead in chennai today

3.gif

Posted: 02/02/2012 11:53 AM IST
Pundari kakshayya

kakshaప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య ఈ రోజు ఉదయం చెన్నయ్ లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. పుండరీకాక్షయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నాళ్ళ క్రితం ఇంట్లో జారిపడినప్పుడు తలకు గాయమడటంతో, అప్పటి నుంచీ ఆయన అనారోగ్యంతోనే వున్నారు. ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చెన్నయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస వదిలారు.

maha_mantri_timmarusuకృష్ణాజిల్లా గుడివాడలో 1925 ఆగష్టు 19 న పుండరీ జన్మించారు. యన్టీఆర్, త్రివిక్రమరావుతో కలిసి నేషనల్ ఆర్ట్స్ థియేటర్స్ నెలకొల్పారు. సినీరంగ ప్రవేశానికి ముందు ఆయన యన్టీఆర్ తో కలిసి నాటకాలు కూడా ఆడారు. మొదట్లో పుండరీ, యన్టీఆర్ చిత్రాల నిర్మాణాన్ని పర్యవేక్షించేవారు.

bhakta_prahladaనిర్మాతగా మారి మహామంత్రి తిమ్మరుసు, తోడుదొంగలు, పిచ్చిపుల్లయ్య, ఆరాధన, పల్లెటూరు, జయసింహా, రాజేశ్వరీ కల్యాణం, పోలీస్ బ్రదర్స్ వంటి పలు చిత్రాలు నిర్మించారు. నిర్మాత గా కాక్షయ్య చివరి చిత్రం 'రావుగారి అబ్బాయి'.

kartavyamతెరపైనా పుండరీకాక్షయ్య తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.  'పిచ్చిపుల్లయ్య', 'భక్తప్రహ్లాద' వంటి సినిమాలలో నటించారు. అయితే 'కర్తవ్యం' సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. విజయశాంతి కథానాయికగా నటించిన ఆ సినిమాలో ముద్దుకృష్ణ పాత్ర ఆయనకు మంచి పాపులారిటీ తెచ్చింది. 'నీ జీవితం మీద నాకు విరక్తి కలిగిందిరా...' అంటూ ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది.

పుండరీ కాక్షయ్య మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వెలిబుచ్చారు. దాసరి నారాయణ రావు, రామానాయుడు, అల్లు అరవింద్ కాక్షయ్య కుటుంభానికి తమ సానుభూతి వ్యక్తం చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film federation of india decided to shut down the theators on 23 of this month
Allu arjun  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles