The great producer in indian cinima

the great producer in indian cinima,B. nagireddy, annual awards entry notification

the great producer in indian cinima,B. nagireddy

5.3.gif

Posted: 01/09/2012 03:35 PM IST
The great producer in indian cinima

         5.1

         పాతాళభైరావి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మకథ, వంటి అద్భుతమైన కళాకండాలను నిర్మించిన గొప్ప నిర్మాత బి. నాగిరెడ్డి. ఆ మహనీయుడు పుట్టి ఈ ఏడాదికి వందేళ్లు పూర్తయ్యాయి.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున నాగిరెడ్డి శతజయంతి ఉత్సవాలను విజయా మెడికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వహించబోతుంది.

           ఇందులో భాగంగానే, ప్రతీ ఏడాది ఇచ్చే నాగిరెడ్డి స్మారక పురస్కారాలకు ప్రకటన విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన రెండు ఉత్తమ వినోదాత్మక చిత్రాలకు ఈ అవార్డులు ఇస్తారు. ఈ మేరకు 2011లో విడుదలైన తెలుగు, తమిళ చిత్రాలకు సంబంధించి ఎంట్రీలను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా దరఖాస్తులు పంపించాలి.

          తెలుగు సినిమాకు ఏప్రిల్ 7న హైదరాబాద్ లోనూ, తమిళ సినిమాకు మే 1న చెన్నైలోనూ బహుమతులు ప్రదానం చేస్తారు. ఒక్కో భాషా చిత్రానికి లక్షా యాభైవేలు నగదు బహుమతి ఉంటుంది. సినీరంగ ప్రముఖులే న్యాయనిర్ణేతలు.  

జనరంజక చిత్రాల నిర్మాణానికి మారుపేరు `విజయ` సంస్థ. ఆ సంస్థ మూలవిరాట్ లు నాగిరెడ్డి, చక్రపాణి. తెలుగు, తమిళ భాషల్లో గొప్ప సినిమాలు నిర్మించి అజరామరమైన కీర్తిని సంపాదించింది విజయా సంస్థ.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi state secretary narayana
Young rebal star prabhas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles