కాబట్టే అర్ధసతదినోత్సవం జరుపుకున్నాడు. ఎన్నో కమర్షియల్ సినిమాల మధ్య విడుదలై, తన గొప్పతనాన్ని చాటుకుని, అన్ని సినిమాలతో పోటిగా ముందుకు సాగుతున్న 'శ్రీ రామ రాజ్యం' సినిమా గురించి నేను అనేది. ఈ సినిమా విడుదలై యాభై రోజులు పూర్తయిన సందర్భంగా, నిన్న అర్ధ శతదినోత్సవం వేడుకలు, హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఘనంగా జరిగాయి. చిత్ర యూనిట్ సభ్యులు, ఈ చిత్ర సృష్టి కర్త బాపు, సంగీత దర్శకుడు ఇళయరాజా, నటీనటులు, బాల కృష్ణ, నయనతార, శ్రీ కాంత్, ఇతర ప్రధాన తారాగణం, దాసరి నారాయణ రావు వంటి వారు ముఖ్య అతిధులుగా విచ్చేయ్యగా, కన్నుల పండుగగా ఈ వేడుక జరిగిందని చెప్పచ్చు.
ఈ సందర్భంగా, ప్రసిద్ధ గాయకుడు, యస్. పీ. బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 'నయనతార, నువ్విక సినిమాలలో నటించి నీ కీర్తిని తగ్గించుకోవద్దు, బాపు లాంటి దర్శకులు నీకు మళ్లీ దొరకరు. నువ్వు చేసిన 'సీత' పాత్రతోనే నువ్వు కలకాలం గుర్తుండిపొవాలి' అని అన్నారు... బాలు ఈ సినిమాలో అత్యధిక పాటలు పాడిన సంగతి మీకు తెలిసిందే... ఇక ముఖ్య అతిధి గా విచ్చేసిన దాసరి నారాయణ రావు, 'నయనతార, నువ్వు పెళ్లి తరువాత సినిమాలు మానేస్తున్నావని మీడియా ద్వారా తెలుసుకున్నాను. జయసుధ, సావిత్రి, సుజాత వంటి ఎందరో నటీమణులు పెళ్ళయిన తరువాత కూడా అద్భుతమైన పాత్రలు పోషించి, మెప్పించారు. పరిశ్రమకు ఇంకా నీ అవసరం ఎంతో ఉంది. దయచేసి పెళ్లి తరువాత నటించడం మానద్దు' అని అన్నారు...
ఇలా కొంతసమయం కాస్త ఆలోచనలో పెట్టె సంభాషణలతో, మరి కొంత సమయం బాలయ్య చేసిన పాత్రని అభినందిచడంతో, నయనతార నటనని కీర్తించడం తో, లక్ష్మనుడిగా శ్రీ కాంత్ ని అభినందించడం థ్ ఒవినోదభారితంగా సాగింది ఈ వేడుక... అయితే, చిత్ర నిర్మాత సాయి బాబు, నయనతార బాలయ్య నటించడానికి సిద్ధం అయితే, మరొక పురానికాన్ని తీస్తానని చెప్పినా మాటలు, అందరిని ఆలోచనలో పెట్టాయి... మరి అంటా నాయనతర చేతిలోనే ఉంది...
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more