Prince mahesh babu latest movie

prince mahesh babu latest movie , business man doing thunders in lot of aspects, this movie is release in a grand way on the sankranti fete

prince mahesh babu latest movie , business man doing thunders in lot of aspects

9.1.gif

Posted: 01/04/2012 04:30 PM IST
Prince mahesh babu latest movie

mahesh-babu

`దూకుడు` సినిమాతో యమ దూకుడు మీదున్న ప్రిన్స్ మహేష్ బాబు సంక్రాంతి పండుగకు `బిజినెస్ మాన్`తో సందడి చేయనున్నాడు. జనవరి 11న తెరలను తాకనున్న ఈ పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ లో దర్శకుడు పూరీ ఎన్నో అత్యద్భుత ఘట్టాలు మిళితం చేసినట్టు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు, రొమాన్స్ కూ ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అలానే హాస్యానికీ ఈ మూవీలో పెద్దపీట వేసారని సమాచారం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాత్ర సినిమాలో నవ్వులు పూయిస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమా ఆడియో ఇప్పటికే యువతను ఉర్రూతలూగిస్తోంది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న `బిజినెస్ మాన్` `ఎ` సర్టిఫికెట్ అందుకున్నట్టు భోగట్టా. తొలి రోజుల్లోనే భారీ మొత్తంలో ఓపెనింగ్స్ రాబట్టేలా అత్యధిక ప్రింట్లతో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. అటు ఈ మూవీ సాంగ్స్ ను చాలా మంది యూత్ కాలర్ ట్యూన్స్ గా పెట్టుకుంటున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

మహేష్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోన్న `బిజినెస్ మాన్` చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఆర్.ఆర్. వెంకట్ నిర్మాత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nithin copied kolaveri di song taking
Balakrishna will beat simha records  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles