ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రానికి కొత్త బంగారు లోకం ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ లో ఇంత వరకు భారీ మల్టీస్టారర్ సినిమా రాలేదు. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీ స్టారర్ చిత్రానికి గత కొన్ని రోజుల నుండి హీరోయిన్ లు దొరకడం లేదు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇప్పటికే సమంత ఖరారైంది. కానీ వెంకటేష్ సరసన నటించడానికి ఎవరు దొరకలేదు. కానీ ఎట్టకేలకు ఓ భామను ఎంపిక చేశారని తెలుస్తుంది. మొదట వెంకీ సరసన త్రిషను ఎంపిక చేద్దామకున్నప్పటికీ మహేష్ వదిన పాత్ర చేయాల్సి వస్తుందని ఒప్పుకోలేదు. భూమికను బుక్ చేశారని మొన్నటి వరకు వార్తలు. కానీ ఆమె కాల్సీట్లు దొరకలేదు. అనుష్కని ట్రై చేస్తే తమిళంలో బిజీగా ఉండటం వలన నో చెప్పింది.
అయితే ఎట్టకేలకు వెంకీ భార్య పాత్రలో నటించే హీరోయిన్ దొరికినట్లు తెలుస్తోంది. బెజవాడ చిత్రంలో నాగచైతన్య సరసన నటించిన అమలపాల్ ఈ సినిమాలో వెంకీ భార్య పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ చిత్రంలో బిజీగా గడుపుతుండగా...వెంకీ తన తాజా సినిమా బాడీగార్డ్ విడుదలపై ఆసక్తిగా ఉన్నాడు. సో.. మొత్తానికి మహష్ కి వదిన... వెంకీకి భార్య దొరికిందన్న మాట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more