The Biography Of Vasantharao Venkata Rao | physical science scientist

Vasantharao venkata rao biography physical science scientist

Vasantharao Venkata Rao news, telugu scientists, physical scientists, indian scientists, Vasantharao Venkata Rao biography, Vasantharao Venkata Rao history, Vasantharao Venkata Rao updates

Vasantharao Venkata Rao biography physical science scientist : The Biography Of Vasantharao Venkata Rao who is famous physical scientist.

భౌతికశాస్త్ర విజ్ఞానాన్ని రచనల ద్వారా విస్తృతపరిచిన శాస్త్రవేత్త

Posted: 05/13/2015 07:58 PM IST
Vasantharao venkata rao biography physical science scientist

‘భారతదేశం’ వంటి పుణ్యభూమిలో ఎందరో ప్రతిభావంతులు జన్మించారు. తమ ప్రతిభతోపాటు దేశ ఔన్నత్యాన్ని చాటిచెబుతూ.. రాబోయే తరాలకు ఆశ్రయంగానూ, ఆదర్శంగానూ నిలిచారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని బలంగా తమ ఆశయాన్ని పదిలపర్చుకున్నవారు ఏదో ఒకరోజు ఖచ్చితంగా సాధిస్తారన్న నమ్మకాన్ని కలిగించారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులు మన లక్ష్యాన్ని అడ్డుకోవన్న సత్యాన్ని చేసి నిరూపించారు. అలాంటివారిలో వసంతరావు వెంకటరావు ఒకరు! ప్రముఖ సైన్స్ రచయిత అయిన ఈయన... భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని రచనల ద్వారా విస్తృత పరిధితో వ్యాపింపజేశారు.

జీవిత విశేషాలు :

1909 ఫిబ్రవరి 21వ తేదీన వసంతరావు వెంకటరావు జన్మించారు. ఈయన తండ్రి పేరు తాతారావు. విజయనగరం మహారాజ కాలేజీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలలో వసంతరావు ఉన్నత విద్య (ఎం.యస్సీ) చదివారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్త సూరి భగవంతం వద్ద భౌతికశాస్త్ర ప్రయోగశాలలో కొంతకాలం శిక్షణ పొందారు. 1935లో విజయనగరంలోని మహారాజా కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యునిగా చేరి, పదోన్నతులను పొందుతూ ప్రిన్సిపాల్ గా (1956-69) పదవీవిరమణ చేశారు.

రచయితగా :

భౌతికశాస్త్రాన్ని అవపోసిన పట్టిన ఈయన... ఆ శాస్త్ర విజ్ఞానాన్ని తన ఉపన్యాసాలు, రచనల ద్వారా విస్తృత పరిధిలో వ్యాపింపచేశారు. తెలుగులో భౌతిక, రసాయనిక శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను తెలుగు భాషా సమితి తరపున రూపొందించారు. దాదాపు సహస్ర విజ్ఞాన వ్యాసాలు రాసారు. వీటిలో అనేకం వ్యాస సంపుటాలుగా వెలువడ్డాయి. ఈయన రాసిన సైన్స్ గ్రంథాలు 32లో కొన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలుగా ఎంపిక అయ్యాయి. వాటిల్లో ‘ఆధునిక విజ్ఞానం’ పేరుతో ఆయన రాసిన పుస్తకం ప్రసిద్ధి చెందింది. ‘మానవ మానవ, పడకటింట్లో విజ్ఞానచర్చ, పారిజాతం’ మొదలగు అనేక పుస్తక రచనలు జన సామాన్యానికి కూడా విజ్ఞానాన్ని చేకూర్చాయి.

విద్యార్థి లోకానికి సంబంధించిన భౌతిక శాస్త్ర సంబందమైన అనేక ప్రయోగాలు వసంతరావు నిర్వహించారు. సామాన్య శాస్త్రం మీద, మాతృభాష మీద ఈయనకు గల అపార గౌరవాభిమానాలు.. తెలుగువారికి వరప్రదాతలయ్యాయి. సైన్స్ ను అతి సరళమైన తెలుగు భాషలో విస్తృత ప్రచారం చేసిన ఈయన 1992, ఏప్రిల్ 25 న మృతి చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vasantharao Venkata Rao  Telugu Scientists  Physical scientists  

Other Articles