Daggubati ramanaidu biography movie moghal producer dada saheb phalke award padma bhushan

ramanaidu biography, daggubati rama naidu, rama naidu life story, rama naidu life history, rama naidu story, rama naidu history, rama naidu wikipedia, rama naidu wiki telugu, rama naidu cremetion, rama naidu death news, rama naidu awards, tollywood producers

daggubati ramanaidu biography movie moghal producer dada saheb phalke award padma bhushan : The Biography of Movie moghal daggubati rama naidu who produces above 100 movies.

వేల పుష్పాలను పరిమళింపజేసిన రామానాయుడు

Posted: 02/19/2015 09:30 PM IST
Daggubati ramanaidu biography movie moghal producer dada saheb phalke award padma bhushan

తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా భావించే మూవీ మొఘల్ డి.రామానాయుడు.. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని నేడు ఈ స్థాయికి ఎదిగారు. ఎన్నో అవకతవకలను చవిచూసి, కష్టాలను ఎదుర్కుని, కొత్త నటీనటులను అవకాశం కల్పించిన ఈయన జీవితం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈయన.. పట్టుదల వుంటే దేన్నైనా సాధించగలని  చేసి నిరూపించుకున్నారు. కేవలం నిర్మాతగాగానే కాదు.. భారత పార్లమెంటు మాజీ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సమాజంలో మంచి కార్యక్రమాలను చేపట్టాలనే థృక్పదంతో ముందుకు నడిచిన ఈయన.. తనకు చేతనైంతవరకు సేవాకార్యక్రమాలను నిర్వహించారు.

జీవిత చరిత్ర :

1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఈయనకు మూడేళ్ల వయస్సు వున్నప్పుడే తల్లి  చనిపోయారు. దీంతో ఆయన తన పినతల్లి దగ్గర ఎంతో గారాబంగానే పెరిగారు. ఒంగోలులోని తన బంధువు అయిన డాక్టర్ బిబిఎల్ సూర్యనారాయణగారి ఇంట్లో వుంటూ ఎస్సెస్సెల్సి దాకా విద్యాభ్యాసం చేశారు. ఈయన పెళ్లి తన సొంత మామా కూతురయిన రాజేశ్వరితో వివాహం జరిగింది. తరువాత తండ్రి పంచిన ఆస్తిలో భాగంగా వందెకరాల పొలంతో సొంతంగా సేద్యం మొదలుపెట్టారు. అయితే.. సినిమాల మీద ఎక్కువ ఆసక్తి వుండేది.

ఓసారి ఈయన జన్మించిన ప్రాంతంలోనే ‘‘నమ్మిన బంటు’’ సినిమా షూటింగ్ జరిగింది. ఆ సందర్భంగా ఎడ్లపందెం దృశ్య చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆయన ఒక సీన్ లో నటించారు. ఎంతో హుషారుగా ఆ సీన్ లో నటించడం వల్ల అక్కడున్న సినిమావాళ్లంతా దృష్టి ఈయనపై పడింది. అయితే.. షూటింగ్ ముగిసిన తర్వాత ఈయన తిరిగి వెళ్తుండగా అక్కడే వున్న అక్కినేని.. ‘‘మీరు సినిమాలోకి ఎందుకు రాకూడదు?’’ అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానంగా ఆయన.. ‘‘నాకు నా ఇల్లు, వ్యవసాయం తప్ప మరే ఆలోచన లేదు’’ అని చెప్పారు.

కొన్నాళ్ల తర్వాత తన అల్లుడితో కలిసి నిత్యం ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్లేవారు. అక్కడే ఆయన సినిమావాళ్లతో పరిచయాలు ఎక్కువయ్యాయి. కొందరు చిత్రనిర్మాతలు తమకు భాగస్వాములు కావాలని రామానాయుడుగారికి కబురు పంపగా.. అందుకు ఆయన ఒప్పుకున్నారు. ఇలా ఈ విధంగా ఆయన తనకు తెలీకుండానే ఇండస్ట్రీలోకి వచ్చేశారు. మొదట సహనిర్మాతగా సినిమాలు చేసిన ఈయన.. ‘‘రాముడు-భీముడు’’ చిత్రంతో పూర్తి నిర్మాతగా మారారు. ఈ చిత్రంకోసం తన దగ్గరున్న ఆస్తిని, ఇంటిని అమ్మేసి మరీ నిర్మించారాయన! ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కొనసాగింది.

‘ప్రేమ్ నగర్’ చిత్రం తీసేటప్పుడు కూడా పరిస్థితి ఘోరంగా వుండేది. తన దగ్గర ఆస్తులు లేకపోయినా.. ఇతరుల నుంచి డబ్బులను సర్దుబాటు చేసి అధిక బడ్జెట్ తో ఆ చిత్రాన్ని నిర్మించారు. అలా మొండిధైర్యంతో ముందడుగు వేసిన ఆయన.. మళ్లీ వెనక్కు తిరగలేదు. ఆయన సినీప్రస్థానాన్ని మలుపు తిప్పడంలో ప్రేమ్ నగర్ ఒక సూపర్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఇక అక్కడి నుంచి ఆయన 15 భాషల్లో 155కు పైగా చిత్రాలను నిర్మించి, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించారు. మూవీ మొఘల్ గా గొప్ప పేరు సాధించారు. అంతేకాదు.. ఈయనకు ‘పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ వంటి పురస్కారాలు కూడా అందాయి.

ఇంతటి గొప్ప ప్రస్థానం కలిగిన ఈయన.. గతకొంతకాలం నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఈయనకు ఎన్నోరకాల మందులు, వివిధ రకాల చికిత్సలు అందించారు. నటుడు, డాక్టర్ అయిన రాజశేఖర్ దాదాపు మూడునెలల వరకు చికిత్స అందించారు. కానీ.. ఫలితం లేకపోయింది. బుధవారం (18-02-2015) మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన ఆకస్మిక మృతిపై టాలీవుడ్ తోపాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. గురువారం (19-02-2015) మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామానాయుడు స్టూడియోస్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daggubati rama naidu biography  telugu producers  

Other Articles